ఏపీలో 19 మంది ఐఏఎస్‌ల బదిలీలు.. అధికారుల కొత్త జాబితా ఇదే..
ఏపీలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా సంక్షేమం, అభివృద్ది, పరిపాలనావ్యవహారాల్లో పెనుమార్పులను తీసుకొస్తున్నారు. సంక్షేమాన్ని కొనసాగించేందుకు తొలిప్రాధాన్యత ఇచ్చిన సీఎం చంద్రబాబు, రెండో ప్రాధాన్యతగా పోలవరం అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించారు. జూన్ 20న రాష్ట్ర రాజధానిపై కూడా ఫోకస్ పెట్టనున్నారు.
ఏపీలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా సంక్షేమం, అభివృద్ది, పరిపాలనావ్యవహారాల్లో పెనుమార్పులను తీసుకొస్తున్నారు. సంక్షేమాన్ని కొనసాగించేందుకు తొలిప్రాధాన్యత ఇచ్చిన సీఎం చంద్రబాబు, రెండో ప్రాధాన్యతగా పోలవరం అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించారు. జూన్ 20న రాష్ట్ర రాజధానిపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. అయితే ఈ క్రమంలోనే పరిపాలనను సానుకూలంగా మరింత పారదర్శకంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందుకుగానూ గతంలోని ఐఏఎస్ అధికారులను కాకుండా వారి స్థానంలో వేరే వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి సెక్రటరీ మొదలు చాలా కీలకమైన శాఖల ప్రధాన కార్యదర్శుల వరకు చాలా మందిని బదిలీ చేశారు.
బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు వీరే..
సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్న
ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్
పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్
వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్
కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ
పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సింఘాల్
సివిల్ సప్లైస్ కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్
పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్
ఉద్యాన, మత్స్య, సహకార శాఖ కార్యదర్శిగా ఎ.బాబు
ఆర్థికశాఖ కార్యదర్శిగా వినయ్‌చంద్
ఆర్థికశాఖ వ్యయ కార్యదర్శిగా ఎం.జానకి
పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్
గనుల శాఖ డైరెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్
ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
తిరుపతి కలెక్టర్‌గా జేసీకి అదనపు బాధ్యతలు
ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్‌రెడ్డి జీఏడీకి అటాచ్
రజత్‌భార్గవ్, శ్రీలక్ష్మి జీఏడీకి అటాచ్
జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్