AP Politics: మార్క్ రాజకీయం మొదలు పెట్టిన గోరంట్ల మాధవ్.. పత్తికొండలో జెండా పాతేందుకు ప్లాన్..

Hindupur MP Gorantla Madhav: నా వెనకున్న బలమైన సామాజిక వర్గం ఓట్లు పడవు.. అయినా టికెట్ అసలు మాత్రం గల్లంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. న్యూడ్ వీడియో కాల్ అంశంతో అల్లరి అయిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవుడులా మారింది. రాజకీయాల్లోకి వచ్చేందుకు పోలీస్ ఉద్యోగం మానేసిన గోరంట్ల మాధవ్ కు రాబోయే ఎన్నికల్లో టికెట్ లేదు అని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఎంపీ గోరంట్ల మాధవ్ అసలైన రాజకీయం మొదలెట్టారు. పార్టీ కోసం ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వస్తే..

AP Politics: మార్క్ రాజకీయం మొదలు పెట్టిన గోరంట్ల మాధవ్.. పత్తికొండలో జెండా పాతేందుకు ప్లాన్..
Hindupur Mp Gorantla Madhav

Edited By:

Updated on: Oct 25, 2023 | 5:45 PM

హిందూపురం, అక్టోబర్ 25: నాకు టికెట్ లేదంటే.. నా వెనకున్న బలమైన సామాజిక వర్గం ఓట్లు పడవు.. అయినా టికెట్ అసలు మాత్రం గల్లంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. న్యూడ్ వీడియో కాల్ అంశంతో అల్లరి అయిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవుడులా మారింది. రాజకీయాల్లోకి వచ్చేందుకు పోలీస్ ఉద్యోగం మానేసిన గోరంట్ల మాధవ్ కు రాబోయే ఎన్నికల్లో టికెట్ లేదు అని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఎంపీ గోరంట్ల మాధవ్ అసలైన రాజకీయం మొదలెట్టారు. పార్టీ కోసం ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వస్తే.. ఒక్కసారికే టికెట్ లేకపోతే ఇక నా పరిస్థితి ఏంటి అని ఎంపీ గోరంట్ల మాధవ్ అయోమయంలో పడ్డారట.

దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని.. లేదంటే తన వెనకున్న బలమైన కురుబ సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పడవు అని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. అదేవిధంగా తనకి టికెట్ లేదంటే కనీసం తన భార్యకు అయిన టికెట్ ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ అధిష్టానం వద్ద తన మనసులో మాట చెప్పారట. వాస్తవానికి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ది కర్నూలు జిల్లా.. ఉద్యోగరీత్యా ఆయన అనంతపురం వచ్చి ఎన్నో సంవత్సరాలు అనంతపురం జిల్లాలోనే పోలీసు ఉద్యోగం చేయడంతో రాజకీయంగా కూడా ఆయనకు అది కలిసి వచ్చింది. అయితే న్యూడ్ వీడియో కాల్ అంశంతో వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంతో పాటు… పార్టీ కూడా కొంత నష్టపోయిందనే అభిప్రాయం వైసిపి అధిష్టానంలో ఉంది.

దీంతో రాబోయే ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ కు అవకాశం లేనట్లే అని జోరుగా ప్రచారం అయితే మాత్రం సాగుతోంది. ఇక్కడే గోరంట్ల మాధవ్ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. అదేవిధంగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. తన సొంత జిల్లా అయిన కర్నూలు జిల్లాలో పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ తన భార్యకి ఇవ్వాలని ప్రయత్నాలు మొదలు పెడుతున్నారట.

అందులో భాగంగానే వైసీపీలో ముఖ్య నేతల మద్దతు ఆయన కూడగడుతున్నారట. అనంతపురం జిల్లాకు వచ్చే ప్రతి వైసీపీ ముఖ్య నేతలను ఇంటికి ఆహ్వానించి.. విందు రాజకీయం చేస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం కూడా ఆలోచనలో పడింది. గోరంట్ల మాధవ్ వ్యవహారంతో పార్టీ కొంత డ్యామేజ్ అయినప్పటికీ కురుబ సామాజిక వర్గ ఓట్లు కీలకం కాబట్టి.. వైసీపీ అధిష్టానం కూడా గోరంట్ల మాధవ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుందా??? లేదా..? అనేది వేచి చూడాలి.

మరన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి