ఏపీ విద్యార్ధులకు పండుగలాంటి వార్త వచ్చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త సంవత్సరం పూట జనవరి 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. పేద, మధ్యతరగతి విద్యార్ధులు ఎక్కువగా జాయిన్ అయ్యే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనుంది. న్యూఇయర్ కానుకగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల విద్యార్ధులకు ఉచిత భోజన పధకాన్ని అమలు చేయనుంది. ఈ స్కీం ద్వారా దాదాపు 1.20 లక్షల మండి విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాల సంచులు పంపిణీ చేయగా.. సంకల్ప్ పేరుతో కేర్ టేకర్లను నియమించి ప్రత్యేకంగా క్లాస్‌లు కూడా నిర్వహిస్తోంది. కాగా, ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇది చదవండి: వాయుగుండం ఉగ్రరూపం.. బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు