Tirumala IRCTC Tour Package: తిరుమల శ్రీవారి భక్తులకు ఐఆర్‌సీటీసీ మరో శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం మరో ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పటికే రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఐఆర్‌సీటీసీ.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఉండే తిరుమేలేశుడి భక్తుల కోసం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ‘తిరుపతి దేవస్థానం’ పేరుతో ఈ ట్యూర్ ప్యాకేజిని అందిస్తోంది. ఈ ప్యాకేజీ టూ డేస్, వన్ నైట్ షెడ్యూల్ ఉంటుంది. మార్చి 5, 12, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ భక్తులకు అందుబాటులో ఉంటుందని ఐఆర్‌సిటిసి ప్రకటించారు. వీకెండ్‌లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.
ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు..
‘తిరుపతి దేవస్థానం’ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీలో భాగంగా తొలిరోజు ఉదయం 8:35 గంటలకు పర్యాటకులు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ఎక్కితే ఉ.11:30 గంటలకు చెన్నై చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకుంటారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్లే మార్గంలోనే శ్రీకాళహస్తి ఆలయ సందర్శన ఉంటుంది. తిరుపతి చేరుకున్నాక హోటల్ గది కేటాయిస్తారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలో బస చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం భక్తులను తిరుమలకు తీసుకెళ్తారు. అక్కడ ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శనం కల్పిస్తారు. దర్శనం అనంతరం తిరుపతిలోని హోటల్‌కు చేరుకోవాలి. ఆ తరుాత చెన్నై విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంటుంది. రాత్రి 7:45 గంటలకు చెన్నైలో విమానం ఎక్కితే రాత్రి 10:45 గంటలకు ఢిల్లీ చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ప్యాకేజీ ఫీజు వివరాలు..
ఐఆర్‌సిటిసి ప్రకటించిన ఈ ప్యాకేజీలో ముగ్గురికైతే రూ.15,660, ఇద్దరికైతే రూ.15,800, ఒక్కరికైతే రూ.17,710 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
Also read:
Andhra Pradesh: చెప్పుతో కొట్టుకున్న వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. రీజన్ ఇదే
Dates: శరీరానికి ఖర్జూర చేసే మేలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ వేసవిలో దీన్ని తింటున్నారా..