AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalliki Vandanam: తల్లికి వందనం నిధులపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే.. లైన్ క్లియర్..

తల్లికి వందనం డబ్బుల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. లబ్దిదారుల అకౌంట్లలో నిధులు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 18వ తేదీలోపు రిలీజ్ చేయనుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే..

Thalliki Vandanam: తల్లికి వందనం నిధులపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే.. లైన్ క్లియర్..
Thalliki Vandanam
Venkatrao Lella
|

Updated on: Jul 06, 2026 | 4:37 PM

Share

ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు జమ చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ నెల 16,17,18వ తేదీల్లో ప్రభుత్వం నిధులు బ్యాంక్ ఖాతాల్లోకి రిలీజ్ చేయనుంది. ఆయా తేదీల్లో మెగా తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల మీటింగ్ జరగనుంది. ఈ సంరద్భంగా నిధులను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. లబ్దిదారులకు అకౌంట్లలో రూ.13 వేలు జమ చేయనుంది. ఈ పథకం కింద రూ.15 వేలు అందిస్తుండగా.. రూ.2 వేలు స్కూళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకుంటుంది.

తల్లికి వందనం అర్హుల లిస్ట్ చెక్ చేసుకోవడం ఎలా..?

తల్లికి వందనం అర్హుల జాబితాను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో అర్హులు ఈ వెబ్‌సైట్లోకి వెళ్లి మీరు లబ్దిదారులుగా ఉన్నారా.. లేదా అనేది తెలుసుకోవచ్చు.

-https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout వెబ్ సైట్ ఓపెన్ చేయండి

-ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి

-స్కీమ్ టైప్‌లో తల్లికి వందనం సెలక్ట్ చేసుకోండి

-ఆ తర్వాత ఇయర్ 2026-27 సెలక్ట్ చేసుకోండి

-అనంతరం గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయండి

-మీరు లబ్దిదారుల జాబితాలో ఉన్నారా.. లదా అనే వివరాలు కనిపిస్తాయి.

ఈ రెండు తప్పనిసరి

అయితే మీరు లబ్దిదారులుగా ఉండి అకౌంట్లో డబ్బులు పడాలంటే ఖచ్చితంగా రెండు పనులు పూర్తి చేయాలి. అందులో ఒకటి ఆధార్ అనసంధానం. బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అలాగే ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేయకపోతే అకౌంట్లో డబ్బులు పడే అవకాశాలు ఉండవు.

అర్హతలు ఇవే..

-విద్యార్థులు ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన స్కూల్స్,కాలేజీల్లో చదువుతూ ఉండాలి

-కుటుంబంలో ఎవరూ ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు

-ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తించదు

-10 ఎకరాల్లోపు భూమి ఉండాలి

-గత 12 నెలల విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్లలోపు ఉండాలి

Follow Us