AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిడిపురి.. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పోలిస్తే ఇక్కడ బంగారం ధర, తరుగు, మేకింగ్ ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. భారీ మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రొద్దుటూరుకు వస్తుంటారు.

పసిడిపురి.. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
Gold Rate In Proddatur
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Sep 08, 2026 | 4:12 PM

Share

మహిళలు ఆభరణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారం, వెండి లాంటివి కొనేందుకు ఇష్టపడతారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితులలో బంగారం కొనాలి అంటే భూములు అమ్ముకోవాల్సిందే.. ఎందుకంటే.. గోల్డ్ ధరలు విపరీతంగా పెరిగాయి.. బంగారం ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల కంటే అతి తక్కువ బంగారం రేట్లు ఉన్న ప్రాంతం మరొకటి ఉంది.. అదేంటో మీకు తెలుసా..? తెలియకపోతే ఈ పసిడి నగరానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకోండి..

కడప జిల్లాలో పసిడిపురిగా పిలవబడే ప్రాంతం ప్రొద్దుటూరు.. బంగారం వ్యాపారంలో బొంబాయి తర్వాత అంతటి వ్యాపారాన్ని చేసే ప్రాంతంగా పిలుస్తారు.. అందుకే.. రెండవ బొంబాయిగా పిలిచే ప్రొద్దుటూరు నగరం బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. బులియన్ రేట్లలో హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ , విజయవాడలతో పాటు ప్రొద్దుటూరు బులియన్ కూడా ప్రతిరోజు అందరూ పరిశీలిస్తూ ఉంటారు. సాధారణంగా పెద్దపెద్ద జ్యువెలరీ షాపులలో ఉండే డిస్కౌంట్ కంటే ప్రొద్దుటూరులో బంగారు ఆభరణాలు కొంటే తులంపై 6 నుంచి 7 వేల వరకు వ్యత్యాసం ఉంటుంది.

అందుకే శుభకార్యాలు ఏమైనా ఉంటే.. చుట్టుపక్కనున్న జిల్లాలే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ప్రొద్దుటూరులో బంగారు ఆభరణాలను కొంటూ ఉంటారు. చిన్నచిన్న ఆభరణాలకు రారు.. కానీ ఎక్కువ మొత్తంలో ఆభరణాలు కొనాలి అంటే మాత్రం ఖచ్చితంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి బంగారాన్ని కొనుగోలు చేస్తారు అంటే అతిశయోక్తి కాదు.. తులంపై ఆరేడు వేలు కలిసి వస్తుంది.. అందుకే ప్రొద్దుటూరులో బంగారం కొనుగోలుకు చాలామంది మక్కువ చూపుతారు.

ఈ రోజు జువెలరీ షాపులలో 22 క్యారెట్ల బంగారం ధర 1,41,900 ఉంటే ప్రొద్దుటూరులో అదే 22 క్యారెట్ల బంగారం ధర 1,36,320 ఉంది అంటే ఈ రోజే దాదాపు 5500 వ్యత్యాసం కనబడుతుంది. అంతేకాకుండా ప్రొద్దుటూరులో పెద్దపెద్ద జ్యువెలరీ షాపులలో దొరికే మోడల్స్ ను హ్యాండ్ మేడ్ తో తయారు చేసి ఇస్తారు. అంతటి నైపుణ్యం ఉన్న కళాకారులు ప్రొద్దుటూరులో ఉన్నారు. అందుకే ప్రొద్దుటూరు బంగారానికి ధర తక్కువ మన్నిక ఎక్కువ అంటారు. అంతేకాకుండా తరుగు విషయంలో కూడా జువెలరీ షాపుల కంటే ఇక్కడ తక్కువగానే ఉంటుంది. మేకింగ్ ఛార్జ్ కూడా తక్కువగానే తీసుకుంటారని వ్యాపారులు చెబుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..