Udayagiri Gold Hills: ఆంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్వే ఆఫ్ ఇండియా.. ఆ కొండంతా ‘బంగారమే’..!?

Udayagiri Gold Hills: ఆంధ్ర వాసులను గుడ్‌ న్యూస్‌ చెప్పింది సర్వే ఆఫ్‌ ఇండియా. అవి మాత్రం వెలికి తీసినట్టయితే.. రాష్ట్రం గొల్డ్‌ మయం కానుంది.

Udayagiri Gold Hills: ఆంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్వే ఆఫ్ ఇండియా.. ఆ కొండంతా ‘బంగారమే’..!?
Udayagiri
Follow us
Shiva Prajapati

|

Updated on: May 18, 2022 | 10:05 AM

Udayagiri Gold Hills: ఆంధ్ర వాసులను గుడ్‌ న్యూస్‌ చెప్పింది సర్వే ఆఫ్‌ ఇండియా. అవి మాత్రం వెలికి తీసినట్టయితే.. రాష్ట్రం గొల్డ్‌ మయం కానుంది. ఇతర రాష్ట్రాల కంటే ధనికమైన రాష్ట్రంగా అవతరించే ఛాన్స్‌ ఉంది. ఇంతకు గోల్డెన్‌ ఛాన్స్‌ ఎంటి.. ఎందుకు ఆ కొండలపైనే అందరి కన్ను పడింది?

ఏపీకి సర్వే ఆఫ్‌ ఇండియి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్‌ క్వార్ట్జ్‌ నిక్షేపాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అన్వేషణ చేపట్టింది. ముమ్మరంగా డ్రిల్లింగ్‌ పనులు నిర్వహించారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్‌ నిర్వహించి కొండలో ఎంత మేర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కొంత కాలంగా డ్రిల్లింగ్‌ పనులు చేపడుతున్నారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1000 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్‌ నిర్వహించింది. దాదాపు 46 శాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

ఇవి కూడా చదవండి

ఉదయగిరి మండలం ఉదయగిరి, మాసాయిపేట పరిసర ప్రాంతాలలో సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా భూముల్లో బంగారు, రాగి, వైట్‌క్వార్ట్జ్‌ నిక్షేపాలున్నట్లు గుర్తించింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందంతో.. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వాహనం డ్రిల్లింగ్‌ చేస్తున్న ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపి సేకరిస్తున్నారు. ఖనిజ నిక్షేపాలతోనైనా ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. రాష్ట్రానికి కూడా ఓ బంగారు కొండ దొరికిందన్న ఆశ పుడుతోంది.