గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సావాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారు ధనలక్ష్మీ అవతారంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి మూల విరాట్, ఉత్సవ విగ్రహాలను రూ.3కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ధనలక్ష్మీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాసవి కన్యకాపరమేశ్వరి అలయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు.