పొలంలో దొరికింది.. ఈ విగ్రహానికి అతీత శక్తులున్నాయ్.. అంటూ కనెక్ట్ అయ్యారు.. చివరకు..
చిత్తూరు జిల్లాలో పంచ లోహ విగ్రహంతో ఘరానా మోసానికి తెర తీసే ప్రయత్నంలో ఓ ముఠా అడ్డంగా బుక్కైంది. పొలంలో అమ్మవారి విగ్రహం దొరికిందని.. దానికి అతీత శక్తులు ఉన్నాయని నమ్మించి అమ్మే ప్రయత్నం చేసిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.. ఈ ఘటన టెంపుల్ సిటీలో కలకలం రేపింది..

చిత్తూరు జిల్లాలో పంచ లోహ విగ్రహంతో ఘరానా మోసానికి తెర తీసే ప్రయత్నంలో ఓ ముఠా అడ్డంగా బుక్కైంది. పొలంలో అమ్మవారి విగ్రహం దొరికిందని.. దానికి అతీత శక్తులు ఉన్నాయని నమ్మించి అమ్మే ప్రయత్నం చేసిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.. ఈ ఘటన టెంపుల్ సిటీలో కలకలం రేపింది.. కల్లాడి గురుస్వామి, దేవినేని చంద్రశేఖర్ అనే ఇద్దర్ని పోలీసులు అదుపులో తీసుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. పలమనేరు రూరల్ మండలం అయ్యరెడ్డిపల్లి కి చెందిన గురుస్వామి, తిరుపతి రాయల్ నగర్ కు చెందిన దేవినేని చంద్ర శేఖర్‌ల ప్లాన్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు.
పాల డెయిరీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్న గురు స్వామి తన పొలంలో విగ్రహం దొరికిందని, అది పంచలోహ విగ్రహమని బంధువు దేవినేని చంద్రశేఖర్ కు సమాచారం ఇచ్చాడు. ఇద్దరూ కలిసి తిరుపతికి వచ్చి గోల్డ్ స్మిత్‌తో చెక్ చేయిస్తే అది కాంస్య విగ్రహం అని తేలింది. చివరకు పలమనేరు పోలీసుల సమాచారంతో.. తిరుపతి పోలీసులు కాపు కాచి పట్టుకున్నారు. అనంతరం ముఠా సభ్యులను అరెస్ట్ చేసి.. ఆ కాంస్య విగ్రహం అసలు కథ తేల్చారు.
గురుస్వామి, చంద్రశేఖర్ పంచలోహ విగ్రహాం పేరుతో బురిడి కొట్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమ్మవారి కాంస్య పంచలోహ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అది దాదాపు 250 గ్రాముల పైగానే ఉందని చెప్పారు. నకిలీ విగ్రహాన్ని తయారు చేయించి, ఆ విగ్రహానికి అతీత శక్తులు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. పక్కా సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకున్నట్లు తిరుపతి పోలీసులు వెల్లడించారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
వీడియో చూడండి..
పలమనేరుకు చెందిన గురుస్వామి, తిరుపతి రాయల్ నగర్ కు చెందిన దేవినేని చంద్రశేఖర్ లను రిమాండ్ కు తరలించామని వెల్లడించారు. నకిలీ విగ్రహాలు, నకిలీ బంగారు అమ్మే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎవరినీ నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తక్కువ ధరకు బంగారు అమ్ముతామని చెప్పే వారి మాయ మాటలు నమ్మి బాధితులుగా మిగిలిపోవద్దని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




