Ganta Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలు సంక్రాంతిని ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విశాఖపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సందడి మామూలుగా లేదు. సంక్రాంతి పండుగను ఆయన ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌లో తన స్నేహితులతో కలిసి గంటా శ్రీనివాసరావు గాలి పటాలను ఎగురవేశారు. కాసేపు చిన్నపిల్లాడిలా మారిపోయి.. స్నేహితులతో సంతోషంగా కాలక్షేపం చేశారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆయన క్షణం తీరకలేకుండా బిజీబిజీగా గడిపారు.
ఇప్పుడు కావాల్సినంత సమయం ఉండటంతో గంటా శ్రీనివాసరావు ప్రతి పండుగను ఆస్వాదిస్తున్నారు. సంప్రదాయ పండుగలకు విలువ ఇస్తూ వాటిని జరుపుకుంటున్నారు. ఇదిలాఉండగా, క్రిందటి నెల డిసెంబర్ 31వ తేదీన కూడా గంటా శ్రీనివాసరావు న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. బీచ్ రోడ్‌లో తన స్నేహితులతో కలిసి కేక్ చేశారు. ఇవాళ్ల సంక్రాంతి పర్వదినం సందర్భంగా బీచ్ రోడ్డులో స్నేహితులతో కలిసి కలియతిరిగారు. వారితో ముచ్చటిస్తూ గాలిపటాలు ఎగురవేశారు.
Also read:
Corona Cases AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..!