Vallabhaneni Vamsi: దమ్ముంటే సారథ్యం వహించి లోకేష్‌ను గెలిపించుకోండి.. పరిటాల సునీతకు వల్లభనేని వంశీ ఛాలెంజ్

చంద్రబాబు దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్‌ అయ్యారు వల్లభనేని వంశీ. గన్నవరంలో రాజీనామా చేయడానికి సిద్ధమని,

Vallabhaneni Vamsi: దమ్ముంటే సారథ్యం వహించి లోకేష్‌ను గెలిపించుకోండి..  పరిటాల సునీతకు వల్లభనేని వంశీ ఛాలెంజ్
Paritala Vs Vallabhaneni

Updated on: Oct 23, 2021 | 12:00 PM

Paritala Sunitha – Vallabhaneni Vamsi: చంద్రబాబు దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్‌ అయ్యారు వల్లభనేని వంశీ. గన్నవరంలో రాజీనామా చేయడానికి సిద్ధమని, పరిటాల సునీత సారథ్యం వహించి లోకేష్‌తో పోటీ చేయించి గెలిపించుకోవాలని సవాల్‌ చేశారు. ఎవరి మధ్యనైనా గొడవలు పెట్టే వ్యక్తి చంద్రబాబు అన్నారు వంశీ.

ఇలాఉండగా, మాజీ మంత్రి పరిటాల సునీత నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామన్నారామె. తమలో ప్రవహించేది సీమ రక్తమేనని.. తన భర్తను చంపినప్పడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని చంద్రబాబు మారాలిని ఆమె సూచించారు. మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వల్లభనేని వంశీ, కొడాలి నానిలు ఓడిపోవడం ఖాయమన్నారు సునీత.

తెలుగుదేశం పార్టీలో వాళ్లకు అవకాశం ఇచ్చారు కాబట్టే మంత్రులు, ఎమ్మెల్యేలుగా లీడర్లుగా ఎదిగారని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. వాళ్ల కంటే ఎక్కువగా మాట్లాగలమని.. కానీ చంద్రబాబు అలా మాట్లాడొద్దని చెబుతున్నారు కాబట్టి ఓర్పుగా ఉన్నామంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లుగా టీడీపీ కేడర్ ఇబ్బందిపడుతుందన్నారని.. ఇక ఓపిక పట్టలేమన్నారు సునీత. ఈ వ్యాఖ్యలకు ఇవాళ వల్లభనేని వంశీ స్పందించడమేకాదు, ఏకంగా ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరేశారు.

Read also: AP Politics: హస్తినకు ఏపీ పంచాయితీ.. ఎల్లుండి మోదీ, అమిత్‌షాతో భేటికి చంద్రబాబు యత్నం