Ganja Cultivation: గంజాయి స్మగ్లింగ్ లో వాడే కింగ్ పిన్..!..గిరిజనులను ట్రాప్ చేసి షూరిటీలు.. మరెన్నో దారుణాలు..

|

Jun 29, 2022 | 9:15 PM

గిరిజనుల కష్టంతో రెండు చేతుల కోట్లాది రూపాయల ను కూడగడుతున్న అంతరాష్ట్ర స్మగ్లర్లు.. కాస్త తేడా వచ్చినా, ఎదురు తిరిగినా నిర్బంధాలు చేస్తున్నారు. తమ క్రూరత్వాన్ని బయటపెట్టి..

Ganja Cultivation: గంజాయి స్మగ్లింగ్ లో వాడే కింగ్ పిన్..!..గిరిజనులను ట్రాప్ చేసి షూరిటీలు.. మరెన్నో దారుణాలు..
Ganja
Follow us on

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో గంజాయి పంట సాగుతున్న విషయం చేదు నిజం. అమాయక గిరిజనులను మభ్యపెట్టి మాయ చేసి.. వారితో గంజాయి పండుగ పండించి.. కోట్లాది రూపాయలను సొమ్ముచేసుకుంటున్నారు స్మగ్లర్లు. విత్తు దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు తృణమో పణమో అందించి కోట్లాది విలువచేసే గంజాయి పంటను ఎత్తుకుపోతున్నారు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్ఫోర్స్మెంట్ వర్గాల కళ్ళు కప్పేందుకు.. సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు ఈ కేటుగాళ్ళు. చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు.. మళ్లీ గిరిజనులపైనే పడుతున్నారు. గిరిజన లోనే స్మగ్లింగ్కు పావులుగా వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయి స్మగ్లింగ్ లో పైలెట్లు గాను, కొరియర్లు గాను గిరిజన యువత మహిళలను వినియోగించుకుంటున్నారు. మాయమాటలతో వారిని ట్రాప్ చేసి.. డబ్బులను ఆశ చూపి.. కోట్లాది రూపాయల గంజాయిని మూడో కంటికి తెలియకుండా సరిహద్దు దాటి చేస్తున్నారు. గంజాయ్ పైలట్లుగా మారి.. చాలామంది కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అయినా పేదరికంలో ఉన్న గిరిజనులు.. డబ్బుకు ఆశపడి పైలెట్లు గా మారుతున్నారు. ఇటువంటి వారినే క్యాచ్ చేస్తున్నారు అంతరాష్ట్ర స్మగ్లర్లు. వారిని మాయమాటలతో మభ్యపెట్టి.. గంజాయి స్మగ్లింగ్ చేయిస్తున్నారు.

గిరిజనుల కష్టంతో కోట్లు కూడగట్టి.. వారికే చిత్ర హింసలు..

ఇవి కూడా చదవండి

గిరిజనుల కష్టంతో రెండు చేతుల కోట్లాది రూపాయల ను కూడగడుతున్న అంతరాష్ట్ర స్మగ్లర్లు.. కాస్త తేడా వచ్చినా, ఎదురు తిరిగినా నిర్బంధాలు చేస్తున్నారు. తమ క్రూరత్వాన్ని బయటపెట్టి.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ప్రాణాలు తీసే ఇస్తామంటూ వారి జీవితాలతో ఆడుకుంటు వెట్టి చాకిరి చేస్తున్నారు. మహారాష్ట్ర కు చెందిన సుభాష్ అన్నా పవార్.. ఏఓబి కేంద్రంగా చేసుకొని గంజాయి స్మగ్లింగ్ లో కింగ్ పిన్ గా మారాడు. మాట వినని గిరిజనులకు కిడ్నాప్ చేసి.. నిర్బంధించి.. చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.

సుభాష్ అన్నా పవార్. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా వాంగి గ్రామం వాడి స్వస్థలం. గంజాయి స్మగ్లింగ్ లో కింగ్ పిన్. ఎంత ఎన్ఫోర్స్మెంట్ ఉన్న నిఘా వర్గాల కళ్ళుగప్పి గంజాయి తరలించడంలో దిట్ట. పలుమార్లు జైలుకెళ్లిన బుద్ధి మార్చుకోకుండా గంజాయి స్మగ్లింగ్ లోనే ఆరితేరి పోయాడు సుభాష్ పవార్. నేరుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తే పొట్ట పడిపోతామోనని.. ఏకంగా గిరిజనులనే పావులుగా వాడుకుంటున్నాడు. వారిని ట్రాప్ చేసి.. పైలెట్లు గాను కొరియర్లు గాను.. వినియోగించుకొని కోట్లాది రూపాయల గంజాయిని సరిహద్దులు దాటి చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. గంజాయి స్మగ్లింగ్ లో ఇంతలా పిన్ గా మారాడో.. అమాయక గిరిజనుల పట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అల్లూరి ఏజెన్సీకి చెందిన ఆరుగురి గిరీజనులను మహారాష్ట్రలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశాడు.

వాడి ఉచ్చులో ఎలా పడ్డారు..!? కిడ్నాప్ అసలు కథేంటి..?

జీకే వీధి మండలం రింతాడ పంచాయతి , ఏబులం కుమ్మరివీధి గ్రామానికి చెందిన
పాంగి కేశవ నివాసం వుంటున్నారు. ఆ గ్రామం లోనే అన్నయ్య అయిన పాంగి గోవర్దన్ నివసిస్తున్నాడు. అయితే పాంగి కేశవ 2020 సoవత్సరంలో కోటనందూరు పోలీస్ స్టేషన్ లో ఒక గంజాయి కేసు లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్ కి వెళ్ళాడు. ఆ జైల్ లో పాంగి కేశవకు మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా వాంగి గ్రామస్తుడు అయిన సుభాష్ అన్నా పవర్ అనే అంతర్రాష్ట్ర నేరస్థుడు పరిచయం అయ్యాడు. ఆ తరువాత పాంగి కేశవ బెయిలు మీధ నుండి బయటకు వచ్చ్చాడు. 2021 సంవత్సరo డిసెంబర్ నెలలో సుభాష్ అన్నా పవర్.. పాంగి కేశవ దగ్గరకి వచ్చి గంజాయి రవాణా కోసం ఆరా తీసాడు.

అప్పుడు ఏబులం గ్రామస్తుడు అయిన గోల్లోరి హరిబాబు, పాంగి కేశవ అన్నయ్య గోవర్దన్ ను పరిచయం చేశాడు. గంజాయిని సరిహద్దులు దాటి ఇస్తే భారీగా నగరాలలో ఇస్తామని వారిని నమ్మించాడు అన్నా పవార్. వారిని నెమ్మదిగా డ్రాప్ చేసి.. ఎనిమిది లక్షల సరుకును పంపమని… ఆ నగదును ఇచ్చి వెళ్ళిపోయాడు పవార్. తరువాత అదే నెలలో గోల్లోరి హరిబాబు, ఇద్దరితో కలసి సుమారు 1700 కేజీల గంజాయిని ఒక వ్యాన్ లో తీసుకొని వెళ్తుండగా కిర్లంపూడి చెక్కపోస్ట్ వద్ద పోలీసులకు దొరికిపోయారు. పాంగి కేశవ అన్నయ్య అక్కడ నుండి తప్పించుకొని వారి గ్రామం ఏబులం తిరిగి వచ్ఛేసాడు.

అయితే.. ఈ విషయం తెలుసుకున్న సుభాష్ అన్నా పవర్.. ఏబులం వచ్చి పాంగి కేశవ అన్నయ్య గోవర్ధన్ ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు. మహారాష్ట్రకు తీసుకెళ్లి నిర్బంధించాడు. గోవర్ధన్ కోసం.. పాంగి కేశవ పవార్ కి ఫోన్ చేసి ఆరా తీసేసరికి.. గంజాయి ఇచ్చి మీ అన్నయ్య ను తీసుకెళ్లండి అని హుకుం జారీ చేశాడు పవర్.

అక్కడకు వెళ్లిన కుటంబ సభ్యులకు మరో షాక్..!

గోవర్ధనను పవర్ ఎత్తుకెళ్లి నిర్బంధించడంతో.. తీవ్ర ఆందోళన చెందిన వారి కుటుంబ సభ్యులు.. ఈ ఏడాది జూన్ 20న మహారాష్ట్ర బయలుదేరి వెళ్లారు. సుభాష్ అన్నా పవర్ ఇంట్లో కేశవ అన్నయ్య గోవర్ధన్ తో పాటు మరొక వ్యక్తి గెమ్మిళి నాగేంద్రబాబు కూడా వున్నాడు. నాగేంద్ర బాబు కోసం ఆరా తీసేసరికి.. 2020 నుంచి తాను అన్న పవర్ నిర్బంధం లోనే ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. నాగేంద్ర బాబు అన్నయ్య గంజాయి పంపకపోవడంతో.. అతనిని కిడ్నాప్ చేసి నిర్వహించినట్టు చెప్పి వాపోయాడు. ఇంట్లో బానిసలా వెట్టిచాకిరి చేయించాడు అన్నా పవార్.

20లక్షల గంజాయి పంపకాపోతే చంపేస్తా..
ఆ దారుణాన్ని స్వయంగా కళ్ళారా చూసిన.. కేశవ్, అతని కుటుంబ సభ్యులు… అన్న పవర్ కు ప్రాధేయపడ్డారు. దింతో కేశవతో పాటు వెళ్ళిన అందరిని ఒక రూమ్ లో నిర్బంధించాడు అన్న పవార్. ఇద్దరు చిన్నారులతో సహా.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని బందించాడు. 20 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి తీసుకొని వచ్చి తన వాళ్ళని తీసుకెళ్లండి అని హుకుం జారీ చేశాడు సుభాష్ అన్నా పవర్. కేశవ అన్నయ్య, కేశవ భార్య యశోదని, పిల్లలు నాలుగేళ్ల తరుణ్, రెండేళ్ల సందీప్ లతో పాటు, వదిన ధనలక్ష్మీని అక్కడే నిర్బంధించి కేశవను పంపించేశాడని బాదితులు గోవర్ధన్, అతని భార్య ధనలక్ష్మి ఆవేదన చెందారు.

అల్లూరి ఎస్పీ సతీష్ చొరవతో…!
కేశవ కుటుంబ సభ్యులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పోలీసులకు చెబితే చెరలో ఉన్న వారి ప్రాణాలు ఏమవుతుందోనన్న భయం.. చెప్పకపోతే ఏ సమయంలో ఏం జరుగుతుందో ఆందోళన.. దీంతో కొద్ది రోజులు అయోమయంలో ఉండిపోయాడు కేశవ్. పరిస్థితి సహకరించకపోవడంతో.. జీకేవీధి పోలీసులను ఆశ్రయించాడు. అన్నా పవార్ అరాచకాలను పోలీసులకు వివరించాడు. తమ కుటుంబ సభ్యులకు విముక్తి కల్పించాలని ప్రాధేయపడ్డాడు. 20 లక్షల రూపాయల విలువ చేసే గంజాయి 10 రోజులులో పంపకపోతే తన కుటుంబ సబ్యులను సుభాష్ అన్నా పవర్ చంపేస్తానని బెదిరిస్తున్నడని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశారు పోలీసులు. విషయం ఎస్ పి సతీష్ కుమార్ దృష్టికి వెళ్లడంతో.. సీరియస్ గా దృష్టిసారించారు జిల్లా పోలీసులు. ఇద్దరు సీరియలతో పాటు ముగ్గురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని.. మహారాష్ట్రకు పంపించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా SP శ్రీ సతీష్ కుమార్ ఆదేశాలతో బృందం మహారాష్ట్ర లోని ఉస్మనాబాద్ జిల్లా SP శ్రీ అతుల్ కులకర్ణి IPS కలిసి పరిస్థితి వివరించారు. అక్కడి పోలీసుల సహకారంతో.. సుభాష్ అన్న పవార్ ను ట్రాక్ చేశారు. నిందితుడి చర లో ఉన్న ఆరుగురు గిరిజనులను.. సేఫ్ గా విముక్తి కలిగించారు. నిందితుడు పవార్ను కటకటాల వెనక్కు నెట్టారు.

గంజాయి స్మగ్లింగ్ లో కింగ్ అయినా.. సుభాష్ అన్నా పవార్ చర నుంచి కేశవ్ కుటుంబ సభ్యులు ఐదుగురుతో పాటు.. గత రెండేళ్ల నుంచి నిర్బంధంలో ఉన్న నాగేంద్ర కుమార్ కూడా విముక్తి కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలతో సురక్షితంగా రక్షించేందుకు అల్లూరి జిల్లా పోలీసులకు చేతులెత్తి నమస్కరించారు బాదితులు.

సుభాష్ అన్న పవార్ అయితే.. జైలు కెల్లాడు. కానీ అటువంటి కరడుగట్టిన స్మగ్లర్లు ఏజెన్సీ కేంద్రంగా అమాయక గిరిజనుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అయితే ఇటువంటి మాయ గళ్ళ ఉచ్చులో పడవద్దని గిరిజనులకు సూచిస్తున్నారు పోలీసులు. ఎవరైనా డబ్బులు ఆశ చూపి గంజాయి స్మగ్లింగ్ కు ప్రేరేపిస్తే సమాచారం ఇచ్చి సహకరించాలని కోరుతున్నారు చింతపల్లి ఏఎస్పీ తుషార్ డుడీ. విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు.

గిరిజనులు కూడా ఇటువంటి అంతర్రాష్ట్ర నేరస్తులకు సహకరించి నేరాల్లో చిక్కుకుంటారా..? లేక ఈ కరడు కట్టిన కేటుగాళ్ల ఆటపాటించేందుకు పోలీసులు సహకరిస్తారా..? అనేది వాళ్ళే తేల్చుకోవాలి.

ఖాజా, వైజాగ్