Andhra Pradesh: అప్పుడలా.. ఇప్పుడిలా.. అవసరం కోసం బంగారం తాకట్టు పెట్టారు.. చివరకు ఏం జరిగిందంటే

|

Nov 16, 2024 | 10:52 AM

దేశంలో సైబర్‌ క్రైమే కాదు.. బ్యాంకుల్లో కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్లను గోల్డ్‌ లోన్స్ పేరిట బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా సత్యసాయి జిల్లాలో ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మడకశిర పట్టణంలోని ఓగోల్డ్ లోన్ సంస్థలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారం బట్టబయలైంది.

Andhra Pradesh: అప్పుడలా.. ఇప్పుడిలా.. అవసరం కోసం బంగారం తాకట్టు పెట్టారు.. చివరకు ఏం జరిగిందంటే
Gold Loan
Follow us on

దేశంలో సైబర్‌ క్రైమే కాదు.. బ్యాంకుల్లో కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్లను గోల్డ్‌ లోన్స్ పేరిట బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా సత్యసాయి జిల్లాలో ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మడకశిర పట్టణంలోని ఓగోల్డ్ లోన్ సంస్థలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారం బట్టబయలైంది. ఈ సంస్థలో బంగారం తాకట్టుపెట్టి అప్పులు తీసుకున్న కస్టమర్లు దగా పడుతున్నారు. బంగారం తాకట్టుపెట్టి తీసుకొన్న రుణం కంటే మూడురెట్లు అధికంగా వడ్డీ తీసుకుంటున్నారని కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నారంటూ నిరసన చేశారు. గోల్డ్‌ లోన్ కార్యాలయానికి తాళం వేశారు. దీంతో గోల్డ్ లోన్‌ ప్రతినిధులకు, కస్టమర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించిన ఇంకా బాకీ ఉందని చూపుతున్నారంటూ కస్టమర్లు లబోదిబోమంటున్నారు. గోల్డ్ లోన్‌లో పెట్టేటప్పుడు ఒక రూల్.. ఇప్పుడు మరో రూల్‌ పాస్ చేస్తున్నారని వాపోతున్నారు. ఎక్కడ లేని వడ్డీలు వసూలు చేస్తూ.. గోల్డ్ తిరిగి ఇవ్వడం లేదంటూ, గోల్డ్ లోన్ ప్రతినిధులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

అధికారులు ఎంక్వైరీ చేసి.. తాకట్టులో ఉన్న తమ బంగారం విడిపించాలని వేడుకుంటున్నారు. గతంలో ఇదే సంస్థలో పని చేసిన మేనేజర్ డబ్బులు గోల్ మాల్ చేసి, కస్టమర్లను ఇబ్బందులు పాలు చేసి పరారయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..