తిరుపతిలో రెండో రోజు కూడా ఎదురుచూపులే.. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాని ఫ్రంట్ లైన్ వారియర్స్..

|

Jan 17, 2021 | 11:40 AM

Covid Vaccine: తిరుపతిలో రెండో రోజు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవడానికి

తిరుపతిలో రెండో రోజు కూడా ఎదురుచూపులే.. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాని ఫ్రంట్ లైన్ వారియర్స్..
Follow us on

Covid Vaccine: తిరుపతిలో రెండో రోజు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు ఒక్కరూ కూడా రాకపోవడంతో అధికారులు అయోమయంలో పడిపోయారు. అధికారులు ఫోన్లు చేసి పిలిచినా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. నిన్న రుయా ఆస్పత్రిలో కేవలం 58 మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించారు.

అయితే కరోనాకు భయపడకుండా సేవలందించిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ వ్యాక్సిన్‌కు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదని అధికారులు వాపోతున్నారు. అయితే కొంతమంది వ్యాక్సిన్ వేయించుకుంటే రియాక్షన్ వస్తుందని భయపడుతున్నారని తెలుస్తోంది. కొంతమంది మాత్రం పండుగకు ఊర్లకు వెళ్లాం కనుక అందుబాటులో లేమంటూ చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం వారిని వ్యాక్సిన్ సెంటర్లకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇవాళ వంద మందికి వ్యాక్సిన్ అందించాలి కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉదయం నుంచి వ్యాక్సిన్ సెంటర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీగా కనిపిస్తున్నారు.

కోవిడ్ వారియర్లకు ప్రత్యేక కోటా.. వారి పిల్లలకు వైద్య విద్యలో రిజర్వేషన్ : నిర్ణయించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖంపట్టిన కరోనా.. కొత్తగా 753 మందికి కొవిడ్ పాజిటివ్