ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం & పొరుగున ఉన్న ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఇది వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి క్రమంగా దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఈశాన్య గాలులు వీస్తాయి. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కరిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. నవంబర్ 19 నుండి 21వ తేదీ వరకు మత్స్యకారులు దక్షిణ ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
Fisherman are advised not to venture into along and off South Andhra Pradesh – Tamilnadu coast during 19th – 21st Nov 2022. pic.twitter.com/RbtTgof7m5
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 17, 2022
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
ఈ రోజు, రేపు :- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.
ఎల్లుండి ;- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈ రోజు :- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
రేపు :- తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ :-
ఈ రోజు, రేపు:- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది
తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాశి పురం, సేలం, ఈరోడ్ జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. కావేరి నదికి ఎగువ నుంచి అంతకంతకు వరద పెరుగుతోంది. మరో వైపు రేపటి నుంచి రాష్ట్రానికి మరోసారి భారీ వర్షసూచన ఉందంటోంది వాతావరణ శాఖ. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్సుంది.
ఎటు చూసిన వరద నీరే కనిపిస్తోంది. ఇల్లు సైతం నీట మునిగాయి. నీరు తప్ప నేల కనిపించడం లేదు. దీంతో నిత్యావసరాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..