Kakinada: కాకినాడలో కరోనా కలకలం.. వైద్య విద్యార్థిని, గర్భిణీ సహా నలుగురికి పాజిటివ్..

|

Apr 07, 2023 | 10:04 AM

కాకినాడ జీజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కొవిడ్ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రంగరాయ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తూ కాకినాడ జీజీహెచ్‌లో వైద్య సేవలందిస్తున్న వైద్య విద్యార్థికి కూడా కొవిడ్‌ సోకింది.  అంతేకాదు ఓ గర్భిణీకి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్నారు.  

Kakinada: కాకినాడలో కరోనా కలకలం.. వైద్య విద్యార్థిని, గర్భిణీ సహా నలుగురికి పాజిటివ్..
Kakinada Ggh
Follow us on

కొన్ని నెలల క్రితం అదుపులోకి వచ్చింది అనుకున్న కరోనా వైరస్.. మళ్ళీ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది.  క్రమంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు మొదలు పెట్టాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. తాజాగా కాకినాడ జిలాల్లో కరోనా కేసులు కలకలం సృష్టించాయి.

కాకినాడ జిజిహెచ్ లో నలుగురికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణైంది. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ, ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి కేసులు. గత నెల 16 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 మంది కొవిడ్ బారినపడ్డారు

కాకినాడ జీజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కొవిడ్ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రంగరాయ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తూ కాకినాడ జీజీహెచ్‌లో వైద్య సేవలందిస్తున్న వైద్య విద్యార్థికి కూడా కొవిడ్‌ సోకింది.  అంతేకాదు ఓ గర్భిణీకి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

జీజీహెచ్లో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలికకు పాజిటివ్ గా నిర్ధారణ  అయింది. మరోవైపు మైక్రోబయాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ రెసిడెంట్ వైద్యురాలికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని జీజీహెచ్ సూపర్డెంట్డెంట్ హేమకుమారి వెల్లడించారు. మళ్ళీ క్రమంగా జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..