డిప్యూటీ సీఎం పవన్‎కు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖ.. కీలక అంశం ప్రస్తావన..

|

Jul 05, 2024 | 12:30 PM

ఏపీలో లేఖ రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‎కు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖ రాజకీయంగా చర్చనీయాంశమైంది. పూర్తిస్థాయిలో రాజకీయ విశ్లేషణాత్మక లేఖగా పేర్కొన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్‎లో కూటమి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‎కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లల్లో పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నానన్నారు.

డిప్యూటీ సీఎం పవన్‎కు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖ.. కీలక అంశం ప్రస్తావన..
Deputy Cm Pawan
Follow us on

ఏపీలో లేఖ రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‎కు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖ రాజకీయంగా చర్చనీయాంశమైంది. పూర్తిస్థాయిలో రాజకీయ విశ్లేషణాత్మక లేఖగా పేర్కొన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్‎లో కూటమి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‎కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లల్లో పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నానన్నారు. సంక్షేమ ఫలాలు ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలి తప్ప రాజకీయ లబ్ధి కోరే విధంగా ఉండకూడదని తెలిపారు. అభివృద్ది కూడా ఒకే చోట కేంద్రీకరించొద్దని పేర్కొన్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గం ఆశిస్తున్న ఐదు శాతం రిజర్వేషన్లను తమ పాలనలో అమలు చేస్తారని ఆశిస్తున్నానని డిప్యూటీ సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు.

గతంలో కాపుసామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని, కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు అప్పటి సీఎం చంద్రబాబు. అయితే అది సాధ్యం కాలేదు. అందులో భాగంగానే ఈ కాపు రిజర్వేషన్ ప్రస్తావన చేసినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగ పేరు పెట్టాలని కోరారు. సినిమాలు మానేయకుండానే సగం రోజులు షూటింగులకు, మిగిలిన సగం రోజులు రాష్ట్ర పరిపాలనకు కేటాయించాలని సూచించారు. అలాగే చేసే సినిమాలు కూడా సమాజానికి ఉపయోగపడేవి, సందేశాత్మకంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో నిర్వీర్యమైన జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ రాజ్ వ్యవస్థలను ఆ శాఖ మంత్రిగా బలోపేతం చేయాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్వో ఆఫీసులు మొదలు జిల్లా కలెక్టర్ భవనాలను, సచివాలయ కట్టడాలను సమకూర్చి అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీంతో పాటూ రోడ్లు, డ్రైనేజీలు, సాగు నీరు, విద్యుత్, పారిశుధ్ద్యం లాంటి సౌకర్యాలు కల్పించాలని, ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. వీటిపై డిప్యూటీ సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..