బ్రేకింగ్ః మాజీ మంత్రి ఖలీల్ బాషా‌ కన్నుమూత

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత ఖలీల్ బాషా క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు ఖలీల్ బాషా‌. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మాజీ మంత్రి ఖలీల్ బాషా మృతి చెందారు. ఆయ‌న‌ మ‌ర‌ణంతో కుటుంబ స‌భ్యులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు..

బ్రేకింగ్ః మాజీ మంత్రి ఖలీల్ బాషా‌ కన్నుమూత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 11, 2020 | 10:14 PM

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత ఖలీల్ బాషా క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు ఖలీల్ బాషా‌. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మాజీ మంత్రి ఖలీల్ బాషా మృతి చెందారు. ఆయ‌న‌ మ‌ర‌ణంతో కుటుంబ స‌భ్యులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. కాగా ఖ‌లీల్ బాషా అంత్య‌క్రియ‌లు బుధ‌వారం క‌డ‌ప జిల్లాలో జ‌ర‌గ‌నున్నాయ‌ని కుటుంబీకులు తెలిపారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రిగా ప‌ని చేశారు ఖ‌లీల్ భాష‌. టీడీపీ హాయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా, మైనార్టీ శాఖ మంత్రిగా ఆయ‌న ప‌ని చేశారు. కాగా ఖ‌లీల్ బాషా 2019 ఫిబ్ర‌వ‌రి 5న టీడీపీకి గుడ్ బై చెప్పి, సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఖ‌లీల్ బాషా మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు.

Read More:

రేణు దేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసి!

మ‌రింత క్షీణించిన మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం

క్షీణించిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

కోవిడ్‌తో ప్ర‌ముఖ సినీ నిర్మాత మృతి