Kodali Nani: రంగా హత్య కేసులో ముద్దాయిలు ఆ పార్టీలో ఉన్నారు.. ఇప్పుడు ఆయన పేరుతో రాజకీయం చేస్తున్నారన్న కొడాలి నాని

|

Dec 26, 2022 | 12:42 PM

గుడివాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోంది. మరోవైపు వంగవీటి మోహన రంగాకి వైసీపీ నేత కొడాలి నాని నివాళ్లర్పించారు. వైసీపీ శ్రేణులతో కలిసి వంగవీటి మోహనరంగా కి దండ వేసి, నివాళ్ళర్పించారు కొడాలి నాని.

Kodali Nani: రంగా హత్య కేసులో ముద్దాయిలు ఆ పార్టీలో ఉన్నారు.. ఇప్పుడు ఆయన పేరుతో రాజకీయం చేస్తున్నారన్న కొడాలి నాని
Kodali Nani
Follow us on

ఓ ముఖ్యమంత్రికి ఉన్న ఆదరణ ఉన్న మనిషి రంగా.. అలాంటి వ్యక్తిని పైకి రాకుండా చేసి చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కేవలం విజయవాడలోనే కాదు ఏపీ రాజకీయాలను దివంగత వంగవీటి మోహనరంగా శాసించారని నాని అన్నారు. ఇలాంటి గొప్ప నాయకున్ని కుట్రలు పన్ని హత్య చేసారని.. ఇందుకోసమే ఆయన శత్రువులు 1983లో టీడీపీలో చేరారంటూ వ్యాఖ్యనించారు. అయితే రంగాను చంపిన దుర్మార్గులు ప్రస్తుతం ఎలాంటి దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే నాని అన్నారు. రంగాను భౌతికంగా దూరంగా చేశారు కానీ.. ఆయన చావుకు కారణమైన వాళ్లు కూడా ఇవాళ దండలు వేసి దండం పెడుతున్నారన్నారని అన్నారు కొడాలి నాని.

వంగవీటి రంగా వర్ధంతిని వైసీపీ క్రమం తప్పకుండా నిర్వహిస్తోందన్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని కార్యక్రమాలు చేస్తున్నామన్నారు కొడాలి నాని. ఆయన హత్యచేసిన వాళ్లు ఎంత దిగజారిపోయారో చూస్తున్నామన్నారు. రంగాను టీడీపీ పార్టీనే హత్య చేయించిందన్నారు. ఎన్టీఆర్‌నే చంపినవారికి వేరేవాళ్లను చంపడానికి వెనకాడరన్నారు కొడాలి నాని.

విజయవాడ రూరల్ మండలం నున్నలో వంగవీటి మోహనరంగా కాంస్య విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. రంగా వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం