తనను మాజీ మంత్రి అని పిలవవద్దని, గుడివాడ(Gudivada) ఎమ్మెల్యేగా ఉండటమే తనకు ఇష్టమని వైసీపీ లీడర్ కొడాలి నాని(Kodali Nani) అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ మండలంలోని దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని బాపట్ల(Bapatla) ఎంపీ నందిగం సురేశ్ తో కలిసి ఆవిష్కరించారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం ఎంతకైనా వ్యవహరిస్తారని కొడాలి నాని విమర్శించారు. మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానమన్న నాని.. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానని పేర్కొన్నారు. సీఎం జగన్ తో కలిసి పనిచేయడమే తన ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందని విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకపోయి ఉంటే ఇప్పటికే రాష్ట్రం తీవ్ర అవస్థల పాలయ్యేదని ధ్వజమెత్తారు. దేవుడు లాంటి వైఎస్ఆర్ ను కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలైందని ఆవేదన చెందారు. బాబ జగ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఊపిరున్నంతకాలం ప్రజా ప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తానని కొడాలి నాని వివరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రభుత్వం చేస్తున్న మంచిని ఓర్చుకోలేక రాష్ట్రంలో తిరుగుతూ విషప్రచారం చేస్తున్నారని ఎంపీ నందిగం సురేశ్ మండిపడ్డారు.
ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు. కేబినెట్ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read
TSTET: టీఎస్ టెట్ అప్లికేషన్‌లో తప్పులు.. అభ్యర్థుల టెన్షన్.. సవరణకు అవకాశం ఇచ్చేనా?..
Number Plate: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఆ ఒక్క నెంబర్ కోసం రూ. 70 కోట్లు పెట్టాడు..