Forest Officers: ఈ ప్రాంతంలో మరోసారి పులి కలకలం.. భయాందోళనలో స్థానికులు..
పల్నాడులో మరోసారి బెబ్బులి భయం మొదలైంది. గత వేసవిలోనూ నల్లమల అటవీ ప్రాంతం నుండి గ్రామాల వైపు వచ్చిన పులులతో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. కొన్ని రోజుల పాటు నల్లమల పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులులు తర్వాత దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. దీంతో స్థానికులు ఊపిర పీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం వెల్ధుర్తి మండలం అచ్చం బావి తండా వద్ద అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని జంతువును కాల్చిన ఆనవాళ్లను అధికారులు గుర్తించారు.
పల్నాడులో మరోసారి బెబ్బులి భయం మొదలైంది. గత వేసవిలోనూ నల్లమల అటవీ ప్రాంతం నుండి గ్రామాల వైపు వచ్చిన పులులతో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. కొన్ని రోజుల పాటు నల్లమల పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులులు తర్వాత దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. దీంతో స్థానికులు ఊపిర పీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం వెల్ధుర్తి మండలం అచ్చం బావి తండా వద్ద అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని జంతువును కాల్చిన ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆనవాళ్లు పంపించినా ఇంతవరకూ చనిపోయిన జంతువును గుర్తించలేకపోయారు. ప్రస్తుతం మాచర్ల మండలం అచ్చమ్మ కుంట వద్ద పొలాల్లో పులి అడుగుజాడలను రైతులు గుర్తించారు. పొలానికి వెళ్లిన రైతులు పెద్ద పెద్ద అడుగులు కనిపించడంతోనే అనుమానం వచ్చి వెంటనే ఈ సమాచారాన్ని అటవీ శాఖాధికారులకు అందజేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పాదముద్రలను గుర్తించారు. వాటి అడుగుల కొలతలను సేకరించారు. సాంకేతిక ఆధారాలతో పరిశీలించిన తర్వాత పులి అడుగుజాడలే అని నిర్ధారించారు. సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ఈ సమయంలో పులి పొల్లాలోకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో వేసవి కావడంతోనే నీటి కోసం డీప్ ఫారెస్ట్ నుండి బయటకు వచ్చిన పులులు దుర్గి మండలం గజాపురం సమీపంలో ఆవుపై దాడి చేశాయి. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. నల్లమల అడవులు సమీపంలో ఉన్నా ఎప్పుడు గ్రామాల వైపు పులులు వచ్చిన ఆనవాళ్లు లేవు. అయితే మొదటి సారి పులుల రాక గుర్తించడంతో పాటు ఆవుపై దాడి చేయడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖా అధికారులు హెచ్చరించారు. అయితే వర్షాలు మొదలు కావడంతో అటవీ ప్రాంతం నుండి బయటకు వచ్చిన పులులు తిరిగి డీప్ పారెస్ట్ లోకి వెళ్లిపోయాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంఖ్య పెరిగి వాటి అవాసాలకు సమస్యలు ఎదురవుతుండటంతోనే పులులు బయటకు వస్తున్నాయని అటవీ శాఖాధికారులు అప్పట్లో ప్రకటించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతం నుండి పులులు బయటకు రాకుండా చర్యలు కూడా చేపట్టారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులల జాడలను ట్రాక్ చేశారు. అయితే నీరు సమ్రుద్దిగా ఉన్న ఇటువంటి తరుణంలో పులులు బయటకు రావడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పులలను ట్రాక్ చేసేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. స్థానిక గ్రామాల ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..