Harsha Kumar on Sharmila: వైఎస్ షర్మిలకు పీసీసీ పదవిపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు..
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలను ఇప్పటికే కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది. షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నేతల్లో కొత్త అసంతృప్తి వెలుగు చూస్తుంది. ఈ క్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రాష్ట్ర విభజన పుణ్యమా అని 2014, 2019లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక 2024 ఎన్నికల్లో సత్తా చాటాలని స్పెషల్ ఫోకస్ పెట్టింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో సాధించిన విజయంతో కాంగ్రెస్ మరింత ఉత్సాహం పని చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో సైతం పాగా వేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలను ఇప్పటికే కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది. షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నేతల్లో కొత్త అసంతృప్తి వెలుగు చూస్తుంది. ఈ క్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని హైకమాండ్‌ను కోరారు హర్షకుమార్. షర్మిలకు పీసీసీ చీఫ్ ఇస్తే బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్నారు. కావాలంటే వైఎస్ షర్మిలకు జాతీయ స్థాయిలో పదవి ఇచ్చుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు హర్షకుమార్.
ఇంతకాలం తెలంగాణ బిడ్డ అని చెప్పుకుని తిరిగిన షర్మిళ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎలా చెల్లుబాటు అవుతుందని హర్షకుమార్ ప్రశ్నించారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు షర్మిల ఇద్దరు ఒకటేనని ఎద్దేవా చేశారు. పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లి అరగంటసేపు మంతనాలు జరపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఏమో ప్రధాని మోదీ వెనుక వెళ్తుంటే, వైఎస్ షర్మిల మాత్రం కాంగ్రెస్ నేత సోనియా గాంధీ వెనుక వెళ్తున్నారన్నారు. కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, తాము సేఫ్‌గా ఉండాలనేది జగన్, షర్మిల ఉద్దేశమని మండిపడ్డారు హర్ష కుమార్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…