APSRTC: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం.? క్లారిటీ ఇదిగో..!
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీలోనూ ఇలాంటి పధకాన్ని త్వరలోనే ప్రవేశపెడతారనే చర్చ గత కొద్దిరోజులుగా నెట్టింట ప్రచారమవుతోంది. ఈ నేపధ్యంలో ఇటీవల దీనిపై ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు.
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీలోనూ ఇలాంటి పధకాన్ని త్వరలోనే ప్రవేశపెడతారనే చర్చ గత కొద్దిరోజులుగా నెట్టింట ప్రచారమవుతోంది. ఈ నేపధ్యంలో ఇటీవల దీనిపై ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. మహిళలకు ఫ్రీ జర్నీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలులోకి తీసుకొస్తే.. ఆర్టీసీపై ఏ మేరకు భారం పడుతుంది.? అనే పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించామని.. తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు..
ఇదిలా ఉంటే.. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు తెలిపారు. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే పది శాతం రాయితీ కూడా వస్తుందన్నారు. అలాగే రాబోయే 4 నెలల్లో 1500 కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. కాగా, ఏపీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ వెబ్‌సైట్ ద్వారా పార్శిల్ డోర్ పికప్ ప్రారంభించామని.. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ గా విజయవాడలో ఈ పార్శిల్ సర్వీసులు కొనసాగుతున్నాయని.. త్వరలోనే అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభిస్తామన్నారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..