Andhra Pradesh: అయ్యో దేవుడా! ఎంత పనైంది.. నిమ్మకాయ రూపంలో వచ్చిన మృత్యువు.. పాపం పసిపాప..
ఏన్నో ఆశలతో వారిద్దరూ పెళ్లిచేసుకున్నారు.. అయితే, వారికి సంతానం లేకపోవడంతో చాలా ఏళ్లు బాధపడ్డారు. ఈ క్రమంలోనే ఏడేళ్ల తర్వాత పండండి ఆడబిడ్డ పుట్టింది. దీంతో ఆ పసిపాపను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.. ఆమె బుడిబుడి అడుగులు వేస్తుంటే మురిసిపోతుండేవారు.. ఈ క్రమంలోనే ఆ దంపతులను విషాదం వెంటాడింది.. నిమ్మకాయ రూపంలో వచ్చిన మృత్యువు చిన్నారిని బలితీసుకుంది..
ఏన్నో ఆశలతో వారిద్దరూ పెళ్లిచేసుకున్నారు.. అయితే, వారికి సంతానం లేకపోవడంతో చాలా ఏళ్లు బాధపడ్డారు. ఈ క్రమంలోనే ఏడేళ్ల తర్వాత పండండి ఆడబిడ్డ పుట్టింది. దీంతో ఆ పసిపాపను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.. ఆమె బుడిబుడి అడుగులు వేస్తుంటే మురిసిపోతుండేవారు.. ఈ క్రమంలోనే ఆ దంపతులను విషాదం వెంటాడింది.. నిమ్మకాయ రూపంలో వచ్చిన మృత్యువు చిన్నారిని బలితీసుకుంది.. దీంతో ఆ దంపతులు.. అయ్యో దేవుడా.. ఎంత పనిచేశావయ్యా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లి గ్రామంలో విషాదం
అనంతపురం జిల్లా.. పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లికి చెందిన వాలంటీర్ సకీదీప, గోవిందరాజులు దంపతులకు ఏడేళ్ల తర్వాత సంతానం కలిగింది. వారికి తొమ్మిది నెలల కుమర్తె జశ్విత కుమార్తె ఉంది. చాలా ఏళ్ల తర్వాత సంతానం కలగడంతో ఆమెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం పాప ఇంటి వరండాలో ఆడుకుంటోంది. ఈ సమయంలో వరండాలో పడిన నిమ్మకాయను తీసుకుని నోట్లో పెట్టుకుంది.
వెంటనే గమనించిన తల్లి సకిదీప.. దాన్ని తీసేందుకు ప్రయత్నించగా అకస్మాత్తుగా గొంతులోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను చికిత్స కోసం వెంటనే పెద్దవడుగూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే.. చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో మెరుగైన వైద్యం కోసం పామిడికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు జశ్విత అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు తమ వెంటే బుడిబుడి అడుగులు వేస్తూ కనిపించిన జశ్విత విగతజీవిగా మారడంతో.. కుటుంబసభ్యులు, స్థానికులు విలపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..