Chittoor: చిరుతను చంపి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితులు.. గోర్లు, ఎముకలు స్వాధీనం

|

Nov 08, 2022 | 3:37 PM

తాము చిరుతను వేటాడిన దగ్గర నుంచి గోళ్లు తీసుకుని కళేబరాన్ని రాళ్ల మధ్యలో పడేసేంత వరకూ నిందితుల్లో ఒకరు వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది అటవీశాఖ అధికారుల దృష్టికి చేరుకుంది.

Chittoor: చిరుతను చంపి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితులు.. గోర్లు, ఎముకలు స్వాధీనం
Hunters in chittoor
Follow us on

ఎన్ని చట్టాలు తెచ్చినా ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రకృతి, పర్యావరణం, అరుదైన జంతువుల రక్షణ గురించి చెబుతున్నా ఇంకా అడవి జంవుతులను వేటాడే వారు వేటాడుతూనే ఉన్నారు. తాజాగా కొందరు వ్యక్తులు ఓ చిరుతను వేటాడి తమ మొబైల్ లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి.. అటవీశాఖ అధికారుల దృష్టికి చేరుకుంది. వెంటనే స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించి.. 5 మంది వేటగాళ్లను చిత్తూరు అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లాలోని మర్రిగుంట తొప్పాతిపల్లి కు చెందిన 5మంది వ్యక్తులు ఏడాదిన్నర క్రితం వన్యప్రాణుల వేటకు వెళ్లారు. యాదమరి మండలం కీనాటపల్లి ఫారెస్ట్ బీట్ ప్రాంతానికి ఈ వేటగాళ్లు వేటకు వెళ్లారు. ఆ సమయంలో తమకు ఎదురైన ఓ చిరుతను నాటు తుపాకీతో కాల్చి చంపారు. అంతేకాదు.. తాము చిరుతను చంపిన విషయం ఎవరికీ తెలియకుండా.. తమకు కావాల్సిన చిరుత గోర్లు, ఎముకలను తీసుకుని.. తర్వాత దాని కళేబరాన్ని రాళ్ల మధ్య పడేశారు. అయితే తాము చిరుతను వేటాడిన దగ్గర నుంచి గోళ్లు తీసుకుని కళేబరాన్ని రాళ్ల మధ్యలో పడేసేంత వరకూ నిందితుల్లో ఒకరు వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది అటవీశాఖ అధికారుల దృష్టికి చేరుకుంది. వెంటనే ఘటనపై విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులు నిందితులను విచారించారు. అటవీ శాఖ అధికారుల దర్యాప్తులో ముద్దాయిలు నిజాన్ని అంగీకరించారు. నిందితుల వద్ద నుండి చిరుత ఎముకలు, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురు నిందితుల్లో నాటు తుపాకీలు తయారు చేసే వారు కూడా ఉన్నారని ఫారెస్ట్ అధికారులు  గుర్తించారు. నిందితుల అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..