కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో భారీ పండుగప్ప మత్సకారులకు భారీ పండుగప్ప చిక్కింది. సాధారణంగా పండుగప్పలు 3 నుంచి 4 కేజీల వరకూ బరువు పెరుగుతాయి. 16 కిలోల పండుగప్ప వలలో పడటంతో స్థానిక మత్యకారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. యానాం ఇందిరాగాంధీ మార్కెట్‌కు ఈ భారీ చేపను విక్రయానికి తెచ్చారు. వేలంలో ఎనిమిది వేల రూపాయలకు పోనమండ భద్రం, రత్నం దంపతులు ఈ చేపను దక్కించుకున్నారు. ఇంత పెద్ద పండుగప్ప చేప దొరకడం చాలా అరుదని మత్యకారులు చెప్తున్నారు. గౌతమి గోదావరిలో మత్యకారులకు దొరికిన పండుగప్ప చేపను ఏషియన్ సీ బాస్ అని కూడా పిలుస్తారు. విషయం తెలియడంతో ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు.
మార్కెట్‌లో ఈ పండుగప్పకు మంచి విలువ ఉంటుంది. పులుపు, ఫ్రై చేయడంతో పాటు ఉప్పు చేపగా కూడా తింటారని స్థానికులు చెబుతున్నారు. ఈ అరుదైన చేపలు చిక్కితే మత్స్యకారుల సంతోషం అంతా ఇంతా కాదు. కాగా అరుదైన చేపలు చిక్కితే వాటిని దక్కించుకునేందుకు..మాంసం ప్రియులు కూడా అంతే ఇంట్రస్ట్ చూపిస్తారు.
Also Read: Vangaveeti Radha: రెక్కీ చేసింది అతడే అని ప్రచారం.. రాధాకు చంద్రబాబు ఫోన్