ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన.. 1,323 సర్పంచ్‌ నామినేషన్లు తిరస్కరణ

ఏపీ వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. జిల్లాల వారీగా అర్హత కలిగిన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన.. 1,323 సర్పంచ్‌ నామినేషన్లు తిరస్కరణ
Follow us

|

Updated on: Feb 03, 2021 | 5:18 PM

Local Body Election : ఏపీ వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. జిల్లాల వారీగా అర్హత కలిగిన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ కారణాలతో పలువురు సర్పంచ్‌, వార్డు మెంబర్‌ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపింది.

విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3,249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికోసం 19,491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18,168 మాత్రమే అర్హత కలిగినవిగా నిర్ధారించారు. సర్పంచ్‌ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 1,323 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

సర్పంచ్‌ అభ్యర్థులకు సంబంధించి చిత్తూరు జిల్లాలో 349, విశాఖపట్నం 152, తూర్పుగోదావరి 141, ప్రకాశం 138, అనంతపురం 112, గుంటూరు 84, కృష్ణా 76, శ్రీకాకుళం 62, కర్నూలు 62, కడప 54, పశ్చిమగోదావరి 52, నెల్లూరు 41 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వార్డు సభ్యులకు సంబంధించి మొత్తం 2,245 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

12 జిల్లాల్లో 32,502 వార్డులకు ఎన్నికలు జరగనుండగా వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 77,554 నామినేషన్లు మాత్రమే అర్హమైనవిగా నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో 336, చిత్తూరు 301, శ్రీకాకుళం 265, కడప 261, తూర్పుగోదావరి 231, కృష్ణా 186, గుంటూరు 147, నెల్లూరు 136, అనంతపురం 117, పశ్చిమగోదావరి 102, విశాఖ 100, కర్నూలు 63 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు