Andhra Pradesh: ఘోరం.. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!

Cracker Gowdown blast in Samarlakota: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 18 మృతి చెందారు. మరికొంత మంది పరిస్ధితి సీరియస్‌ గా ఉన్నట్లు పేర్కొంటున్నారు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Andhra Pradesh: ఘోరం.. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!
Massive Explosion In Vetlapalem

Updated on: Feb 28, 2026 | 4:06 PM

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 18 మృతి చెందారు. మరికొంత మంది పరిస్ధితి సీరియస్‌ గా ఉన్నట్లు పేర్కొంటున్నారు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ప్రమాదం జరిగినప్పుడు స్పాట్‌లో 20 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.. బ్లాస్ట్ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే అక్కడికి చేరుకుని మంటలార్పుతున్నారు. స్థానికులు, అగ్నిమాపకశాఖ సిబ్బందితో కలిసి మంటలను ఆర్పుతున్నారు. గాయపడిన వారిని అంబులెన్సులలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. తీవ్ర గాయాలతో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..

టపాసులు తయారు చేస్తుండగా.. పెద్ద ఎత్తున పేలుడు జరిగినట్లు పేర్కొంటున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీకి సమీపంలోని భవనాలు సైతం ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి..

వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితతోపాటు ఆదేశించారు. అక్కడి పరిస్థితులను చంద్రబాబు .. అధికారులను అడిగి తెలుసుకున్నారు.

లైవ్ వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us