మంగళగిరి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాజా టోల్ ప్లాజా వద్ద ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న ఓ లారీ పూర్తిగా దగ్దం అయింది. ఈ లారీ తమిళనాడుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. కాజా టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ చెల్లింపు సమయంలో లారీ టైర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో మంటలు చెలరేగాయి.
ఆయిల్ ట్యాంక్‌కు మంటలు వ్యాపించడంతో మరింత వేగంగా అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. ఈ ఘటనలో కూడి, ఎడమ వైపుల ఉన్న రెండు టోల్ చెల్లింపులు తీసుకునే బాక్స్లు మంటల్లో కాలిపోయాయి. లాక్ డౌన్ సభయం కావటంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.
ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని లారీలో ఎలాంటి లోడు లేదని మంటలను అదుపులోకి తీసుకొని వస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదంకు ప్రధాన కారణం కేవలం లారీ టైరు పేలటమే అని ప్రాథమికంగా అంచనా తెలిసిందన్నారు. దీనిపై రూరల్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.