AP News: వేడుకున్నా కనికరించలేదు.. బైక్ ఎత్తుకెళ్లారు.. రెచ్చిపోయిన ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు..

|

Aug 17, 2022 | 9:27 PM

స్కూటీ తీసుకెళ్లొద్దు.. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా.. అని అతను ఎంత వేడుకున్నా.. ఎజెంట్లు అవేమి వినిపించుకోకుండా ద్విచక్రవాహనాన్ని పట్టుకెళ్లారు.

AP News: వేడుకున్నా కనికరించలేదు.. బైక్ ఎత్తుకెళ్లారు.. రెచ్చిపోయిన ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు..
Loan Recovery Agents harassment
Follow us on

Vizianagaram finance company harassment: ఫైనాన్స్ కంపెనీల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. ఫోన్ చేసి వేధించడం.. ఇంటికొచ్చి తిట్టడమే కాదు. ఏకంగా నడిరోడ్డుపైనే వాహనాలు ఎత్తుకెళ్తున్నారు ఫైనాన్స్ ఏజెంట్లు. తాజాగా.. విజయనగరం జిల్లా రాజాంలో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు రెచ్చిపోయారు. స్కూటీ తీసుకెళ్లొద్దు.. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా.. అని అతను ఎంత వేడుకున్నా.. ఎజెంట్లు అవేమి వినిపించుకోకుండా ద్విచక్రవాహనాన్ని పట్టుకెళ్లారు. ఈ రికవరీ ఏజెంట్స్ వేధింపులు టీవీ9 కెమెరాకి చిక్కాయి. రెండు నెలలు EMI కట్టలేదని నడిరోడ్డుపైనే యువకుడిని నిలిపివేశారు. డబ్బులు కట్టాలని వేధించారు. గంట టైమ్ ఇవ్వండి.. బాకీ అమౌంట్ మొత్తం ఇచ్చేస్తా.. అని ఆ కుర్రాడు చెప్పినా వినిపించుకోలేదు. నడిరోడ్డుమీదే అతని దగ్గర ఉన్న బైక్‌ను ఎత్తుకుని వెళ్లిపోయారు రికవరీ ఏజెంట్లు.

లలితా బైక్ ఫైనాన్స్ దగ్గర రాజాంకు చెందిన యువకుడు లోన్ తీసుకున్నాడు. మొదట్లో రెగ్యులర్‌గా పేమెంట్ చేసేవాడు. ఇటీవల పనులు సరిగా లేక.. డబ్బులు కట్టలేకపోయాడు. కానీ నడిరోడ్డుపై బండి తీసుకెళ్లడం ఏంటని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు.

లోన్స్‌ యాప్స్‌ అయినా ఫైనాన్స్ కంపెనీలయినా.. ఆర్బీఐ రూల్స్‌ ప్రకారమే చేయాలి. ప్రభుత్వం, పోలీసులు ఈ విషయంపై వార్నింగ్ ఇస్తూనే ఉన్నాయి. అయినా డోంట్ కేర్‌ అంటున్నారు. వేధింపులు, దాడులకు పాల్పడుతూ రికవరీ ఏజెంట్లు.. బాధితులను భయాందోళనలకు గురిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..