Andhra Pradesh: అప్పు చేసి పంట వేసిన అన్నదాత.. నష్టాలు రావడంతో ఆత్మహత్య
Andhrapradesh: మన దేశంలో సారవంతమైన భూములు, కష్టపని పనిచే అనుభవజ్ఞులైన రైతులు ఆదాయం పెరిగిన ప్రభుత్వాలు.. కొనుగోలు శక్తి పెరిగిన ప్రజలు ఉండి కూడా అన్నదాత(Farmer) జీవితం ఎడారి మయం. అన్ని రంగాల్లోనూ..
Andhra Pradesh: మన దేశంలో సారవంతమైన భూములు, కష్టపని పనిచే అనుభవజ్ఞులైన రైతులు ఆదాయం పెరిగిన ప్రభుత్వాలు.. కొనుగోలు శక్తి పెరిగిన ప్రజలు ఉండి కూడా అన్నదాత(Farmer) జీవితం ఎడారి మయం. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్న మన దేశం ఒక్క వ్యవసాయ రంగంలో మాత్రమే కుచించుకుపోతుంది. జై జవాన్.. కిసాన్.. రైతే రాజు.. రైతు అభివృద్ధి చెందితే.. దేశం అభివృద్ధి చెందుతుందని మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాయకులు, ప్రభుత్వాలు చెప్పేమాట.. ఎన్నికల సమయంలో చెప్పే వాగ్దానాలు అమలు చేసే సమయం వచ్చే సరికి రైతులకు రిక్త హస్తాలను చూపిస్తున్నారు. ఓవైపు ప్రకృతి విపత్తులు, నకీలీ పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పులు వెరసి రైతుల ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ అన్నం పెట్టె రైతు.. ఆదాయం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ అన్నదాత ఉసురు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
అప్పుల బాధ తాళలేక పాతలింగ(36) అనే రైతు ఆత్మహత్య చేసుకొన్న దారుణ ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలంలోని కొత్తూరులో చోటుచేసుకొంది. పాతలింగ ఏడెకరాల పొలంలో రెండుసార్లు టమోటా, ఒకసారి వరి పంట వేశాడు. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు. సుమారు 10 లక్షల రూపాయల వరకూ అప్పు చేశాడు. అయితే పంటకు సరైన ధరలకు లేక నష్టాలు వచ్చాయి. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పాతలింగానికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటర్ చదువుతున్న పెద్ద కొడుకుని చదువు మాన్పించి..కుటుంబ పోషణ కోసం కొన్ని రోజుల క్రితం.. తోటల్లో కూలీ పనులకు పంపారు. కుటుంబ పెద్ద అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: Badrachalam: రామయ్య ఆలయంలో పెరిగిన సేవలు, ప్రసాదం ధరలు.. రేపటి నుంచి అమలు.. ఎంత మేర పెరిగాయంటే