ఓ తండ్రి కష్టం.. కొడుకు స్మార్ట్ ఆలోచన.. ఇక పొలంలో అడుగు పెడితే మోత మోగాల్సిందే..

ఒక్క ఐడియా సమస్యకు పరిష్కారం చూపింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికి దక్కేలా చేసింది. వ్యవసాయ పొలంలోని ఎలెక్ట్రిక్ వస్తువులే కాదు పశుగ్రాసం కూడా కాజేస్తున్న దొంగల భరతం పట్టేలా నిఘా నేత్రం సహకరించింది. దొంగల బెడదకు చెక్ పెట్టినట్లు అయింది.

ఓ తండ్రి కష్టం.. కొడుకు స్మార్ట్ ఆలోచన.. ఇక పొలంలో అడుగు పెడితే మోత మోగాల్సిందే..
Farm Theft Innovative Solution

Edited By:

Updated on: Jun 01, 2025 | 11:18 AM

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఒక రైతు వినూత్న ప్రయత్నం ఫలించింది. వాల్మీకి పురం మండలం ఎగువ బూడిదవేడు గ్రామానికి చెందిన రైతు వెంకట రమణారెడ్డికి ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న రైతు వెంకట రమణారెడ్డికి దొంగల బెడద పెద్ద సమస్యగా మారిపోయింది. పొలంలో తరచూ చోరీలు జరుగుతుండడం పెద్ద కష్టంగా మారిపోయింది. రెండుసార్లు స్టార్టర్లు ఎత్తుకెళ్లిన దొంగలు ఒకసారి ఏకంగా ట్రాన్స్ఫార్మర్ ని కొట్టేశారు. పొలంలో సాగు చేసిన పంట చేతికి వచ్చిన సమయంలో విద్యుత్ పరికరాల చోరీ రైతుకు పెద్ద నష్టాన్ని మిగిల్చింది. చివరికి పశుగ్రాసం సాగు చేసినా దొంగల బెడద మాత్రం తప్పలేదు. రాత్రి వేళల్లో పొలంలో చొరబడి పశుగ్రాసం కోసుకెళుతున్న దొంగలు రైతు వెంకటరమణ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేశారు.

దీంతో హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న కొడుకు శ్రీకాంత్ రెడ్డితో తండ్రి వెంకటరమణారెడ్డి కష్టాన్ని చెప్పుకొచ్చాడు. దీంతో తండ్రి కష్టం దొంగల పాలవుతుండడంతో.. కొడుకు శ్రీకాంత్ రెడ్డికి కొత్త ఐడియా వచ్చింది. పొలానికి సీసీ కెమెరా దన్నుగా నిలుస్తుందని భావించిన శ్రీకాంత్ రెడ్డి.. తండ్రి కష్టానికి పరిష్కారం ఆలోచించాడు. ఇందులో భాగంగానే పొలానికి సోలార్ సీసీ కెమెరాలు, సైరన్ తో నిరంతరం నిఘాతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. పగలు, రాత్రి నిరంతరం పొలం చుట్టూ సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం అమలు చేశాడు. ఎవరైనా కెమెరా పరిధిలోకి వస్తే రికార్డ్ చేయడంతో పాటు సైరన్ మోగేలా చేశాడు. రెండు కెమెరాల ఏర్పాటుకు రూ.18 వేలు ఖర్చు చేసి పొలంలో జరుగుతున్న దొంగతనాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు తండ్రి కొడుకులు..

వీడియో చూడండి..


ఇలా నిఘా నేత్రంతో ఇంటి దగ్గర ఉన్న, హైదరాబాదులో ఉన్నా సెల్‌ఫోన్ లో చూసుకుని కాపలా కాసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. నిరంతరం పొలంపై నిఘా ఉండేలా చేసిన సీసీ కెమెరాలతో రైతు సమస్యకు పరిష్కారం దొరికినట్లు అయ్యింది. అన్నమయ్య జిల్లాకు చెందిన రైతు కొడుకు వినూత్న ప్రయత్నంతో పొలంలో జరుగుతున్న చోరీల చెక్ పెట్టి సక్సెస్ కావడం అందరినీ ఆకట్టుకునేలా చేసింది.

హైదరాబాద్‌ బాలానగర్‌లోని PHCలో డెలివరీ తర్వాత తల్లీబిడ్డా ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశమైంది. శనివారం ఉదయం 7.50కు మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, శిశువు ఉమ్మనీరు తాగాడని నిలోఫర్‌కు తీసుకెళ్లాలని చెప్పడంతో అక్కడికి తీసుకెళ్లారు.. ఆ తర్వాత మహిళ తమ్ముడు ఆరోగ్య కేంద్రానికి వచ్చేసరికి బాలింత విగతజీవిగా పడి ఉంది. ఆ కాసేపటికే బిడ్డ కూడా మరణించాడు.. ఈ ఘటన కలకలం రేపింది. బాలానగర్‌లో తల్లీబిడ్డల మృతి కేసుపై విచారణ జరుగుతోందని డీఎంహెచ్ఓ ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..