Cheating: కర్నూలులో రెచ్చిపోయిన మోసగాళ్లు.. అడవి బిడ్డల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకున్న భారీ మోసం..

|

Oct 31, 2021 | 8:56 AM

Cheating: కర్నూలు జిల్లాలో మోసగాళ్లు రెచ్చిపోయారు. అడవి బిడ్డల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు కాజేశారు కేటుగాళ్లు.

Cheating: కర్నూలులో రెచ్చిపోయిన మోసగాళ్లు.. అడవి బిడ్డల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకున్న భారీ మోసం..
Fraud
Follow us on

Cheating: కర్నూలు జిల్లాలో మోసగాళ్లు రెచ్చిపోయారు. అడవి బిడ్డల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు కాజేశారు కేటుగాళ్లు. మోసపాయామని తెలిసి.. ఆ అమాయక గిరిజనులు బోరున విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చీటింగ్‌కు సంబంధించి పోలీసులు, బాదితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కమల అడవుల్లోని పెచెరువు గూడెంలో చెంచులు నివసిస్తున్నారు. అయితే, పెచెరువు గూడెంకు వచ్చిన కొందరు కేటుగాళ్లు.. వారి నుంచి డబ్బు కాజేసేందుకు కుట్రలు చేశారు. ఈ క్రమంలో వారికి బహుమతుల ఎర వేసి.. తమ పథకాన్ని అమలు చేశారు. ఒకసారి 12,800 రూపాయలు కడితే మూడు తరాల వారికి వారానికి వెయ్యి రూపాయల ప్రకారం ఫించన్ వస్తుందని, ఆ డబ్బు నేరుగా వారి అకౌంట్‌లో పడుతుందని నకిలీ ఆన్‌లైన్ కంపెనీ ప్రతినిధులు ఊదరగొట్టారు.

వారిని ఆకట్టుకునేందుకు.. డిన్నర్ సెట్‌ను కూడా ఉచితంగా ఇస్తామని చెప్పారు. దాంతో మోసగాళ్ల మాయ మాటలు నమ్మిన 40 చెంచు కుటుంబాలు.. కేటుగాళ్లు అడిగిన మొత్తాన్ని చెల్లించారు. డబ్బులు తీసుకున్న మోసగాళ్లు.. ఆ తరువాత పత్తా లేకుండా పోయారు. ఫోన్ చేసినా రెస్పాండ్ అవకపోవడంతో.. మోసపోయామని గ్రహించారు చెంచులు. వెంటనే ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. జరిగిన విషయాన్ని అధికారులకు తెలిపారు. మోసగాళ్లపై ఫిర్యాదు చేశారు. బాధిత చెంచుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

అందమైన ఈ తోటను ముట్టుకుంటే ప్రాణాలు గాల్లోనే..! వీడియో

Viral Video: అమ్మా నీకు వందనం.. పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

విమానంలో పుట్టిన పిల్లలకు ఏ పౌరసత్వం లభిస్తుంది..?? వీడియో