AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: బాబోయ్ నకిలీ డాక్టర్లు.. దాతల కోసం చూస్తుంటే దోచేసుకున్నారు…!

తన కొడుకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగి ఆరోగ్యంగా ఉంటాడు అనుకుని ఆశగా ఇంటికి వెళ్లిన రాంజీకి.. మరో రెండు గంటల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. మీ మెడికల్ రిపోర్ట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పడి ఉన్నాయి. మర్చిపోయారేమో ఒకసారి చెక్ చేసుకోండి. అందులో సారాంశం. నరసింహులు అండ్ టీం కి ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ అక్కడ ఎందుకు వెళ్లాయి అనేదానిపై కంగారు పడ్డాడు రాంజీ.

Visakhapatnam: బాబోయ్ నకిలీ డాక్టర్లు.. దాతల కోసం చూస్తుంటే దోచేసుకున్నారు...!
Visakhapatnam I Town Politica Station
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 01, 2025 | 4:24 PM

Share

ఆశపడిన వాళ్లని అడ్డంగా దోచుకునే మోసగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ.. అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఓ కుటుంబాన్ని ఆశపెట్టి వసూలు చేసి పారిపోయారు నకిలీ డాక్టర్లు. అనారోగ్యంతో ఉన్న బాలుడికి ఆదుకుంటామని చెప్పి వైద్యుల వేషంలో మాట కలిపి మోసగించారు. ఆర్థిక స్థోమత లేక దాతల కోసం ఎదురుచూస్తున్నాం అని చెప్పినా… ట్రాప్ చేసి లక్ష లాగేశారు. వాళ్ళ మాటల్లో పడి కొడుకు ఆరోగ్యంగా ఉంటాడని లక్ష సమకూర్చి ఇస్తే.. ఫోన్ స్విచ్ ఆఫ్..!

విశాఖ వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రాంతంలోనే ఉప్పరపేటకు చెందిన దూసి రాంజీ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. 2018 లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. వారిలో ఐదేళ్ల చిన్న కొడుకు మోక్షిత్ రామ్ చిన్నప్పుడు నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కొంతకాలం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స చేయించిన.. ఆ తర్వాత శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి విశాఖ తీసుకెళ్లాలని సూచించారు. మోక్షిత్ కు విశాఖ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. విశాఖలోని బంధువుల ఇంట్లో ఉంటూ.. మోక్షిత్ కు వైద్యం చేయించేవారు.

కొంపముంచిన దాతల కోసం ప్రకటన..!

ఈలోగా రాంజీ అప్పులు కూడా చేయడంతో.. కొడుకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేయాల్సిందిగా దాతల కోసం ఫిబ్రవరి 22న ప్రకటన ఇచ్చాడు తండ్రి. దీంతో ఫిబ్రవరి 25వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు డాక్టర్ నరసింహులుగా చెప్పుకుంటూ పరిచయం చేసుకున్నాడు. బాలుడి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తన దగ్గరకు ప్రభుత్వం నుంచి చేరాయని.. ఓసారి కేజీహెచ్ కు వచ్చి కలవాలని సూచించాడు. అతను చెప్పినట్టుగానే రాంజీ కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లి ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన డాక్టర్ నరసింహులు అని చెప్పుకున్న ఆ ఆగంతకుడు.. తన అసిస్టెంట్ను పంపిస్తున్నామని చెప్పాడు.

ఈ లోగా ఓ వ్యక్తి వైద్యుడు వేషంలో వచ్చి తన పేరు డాక్టర్ ప్రవీణ్‌గా పరిచయం చేసుకున్నాడు. కేజీహెచ్ లో పీజీ డాక్టర్ అని చెప్పుకుంటూ మాటలు కలిపాడు. రాంజీని కేజీహెచ్ సూపరిండెండెంట్ ఆఫీస్ వద్దకు తీసుకెళ్లాడు. బయట వెయిట్ చేయాలని చెప్పి.. హడావిడిగా అటు ఇటు తిరిగాడు. డాక్టర్ ప్రవీణ్ గా చెప్పుకునే ఆ వ్యక్తి కాసేపటికి మళ్ళీ రాంజీ దగ్గరకు వచ్చాడు. లక్ష రూపాయలు రెడీ చేసుకుంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుందని బాధితుడిని నమ్మించాడు. ఇంటికి వెళ్ళినా బాధితుడికి మళ్లీ డాక్టర్ నర్సింహులుగా పరిచయం చేసుకున్న వ్యక్తి ఫోన్ చేశాడు. లక్ష పట్టుకుని అర్జెంటుగా కేజీహెచ్ పిల్లల వార్డు వద్దకు రావాలని సూచించాడు. దీంతో రాంజీ లక్ష రూపాయల పట్టుకుని కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ తిష్ట వేసుకున్న నరసింహం.. కాస్త దూరంలో ఉన్న డ్రైవర్ కు క్యాష్ ఇచ్చి వెళ్లాలని సూచించాడు. నరసింహం సూచించినట్టుగానే లక్ష రూపాయలను కారు డ్రైవర్ కు ఇచ్చి వెళ్లిపోయారు బాధితుడు.

ఇంటికి వెళ్లిన రెండు గంటలకే మరో కాల్

తన కొడుకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగి ఆరోగ్యంగా ఉంటాడు అనుకుని ఆశగా ఇంటికి వెళ్లిన రాంజీకి.. మరో రెండు గంటల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. మీ మెడికల్ రిపోర్ట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పడి ఉన్నాయి. మర్చిపోయారేమో ఒకసారి చెక్ చేసుకోండి. అందులో సారాంశం. నరసింహులు అండ్ టీం కి ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ అక్కడ ఎందుకు వెళ్లాయి అనేదానిపై కంగారు పడ్డాడు రాంజీ. దీంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లి మెడికల్ రిపోర్ట్స్‌ను కలెక్ట్ చేసుకున్నాడు. వెంటనే అక్కడ నుంచి నర్సింహులుకు ఫోన్ చేశాడు. కాల్ అటెండ్ చేసిన నరసింహులు ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసేశాడు. ఎంతకీ లిఫ్ట్ చేయకపోయేసరికి.. ఇక తన మోసపోయిన అని గుర్తించిన రాంజీ.. వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు.

రెండు సెక్షన్ల కింద కేసు.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

బాధితుడు రాంజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు వన్ టౌన్ పోలీసులు. 318(4), 319(2) BNS సెక్షన్ల కింద కేసు నమోదు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు వన్ టౌన్ సిఐ జీడి బాబు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి