Vangaveeti Radha: ‘నన్ను చంపడానికి రెక్కీ చేశారు’.. వంగవీటి రాధా సంచలన ఆరోపణలు

వంగవీటి వాట్‌ నెక్ట్స్‌..! కృష్ణా జిల్లా పాలిటిక్స్‌లో ఇప్పుడిదో మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇవాళ వంగవీటి రంగా వర్ధంతి. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానుల సందడి కనిపించింది.

Vangaveeti Radha: నన్ను చంపడానికి రెక్కీ చేశారు.. వంగవీటి రాధా సంచలన ఆరోపణలు
Vangaveeti Radha

Updated on: Dec 26, 2021 | 4:22 PM

వంగవీటి వాట్‌ నెక్ట్స్‌..! కృష్ణా జిల్లా పాలిటిక్స్‌లో ఇప్పుడిదో మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇవాళ వంగవీటి రంగా వర్ధంతి. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానుల సందడి కనిపించింది. అయితే విజయవాడలో కనిపించిన ఆ ఒక్క సీన్‌ మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. ఒక్కసారిగా కృష్ణా జిల్లా రాజకీయమంతా ఆ సీన్‌పై ఫోకస్‌ అయింది.

వంగవీటి రంగా విగ్రహానికి రాధా, వల్లభనేని వంశీ కలిసి వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గుడివాడ దగ్గరలోని కొండలమ్మ గుడిలో మంత్రి కొడాలి నాని, వంశీ, రాధా కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఎప్పటి నుంచో వీరు ముగ్గురు స్నేహితులుగా ఉన్నారు. ప్రస్తుతం రాధా టీడీపీలో ఉన్నారు. అసలే వైసీపీకి, టీడీపీకి రాజకీయ యుద్ధం పీక్‌లో ఉన్న టైమ్‌లో ఈ ముగ్గురు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం టాక్‌ ఆఫ్‌ ది కృష్ణా టౌన్‌గా మారింది.

కాగా రంగ వర్థంతి సభలో రాధా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని రాధా బాంబ్ పేల్చారు. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని రాధా స్పష్టం చేవారు. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

Also Read:  బెజవాడలో ఇంట్రస్టింగ్ సీన్.. వంశీ, రాధా భేటీ

 బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటు.. శనివారం రాత్రి ఘటన