Nellore: అనిల్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? ఆత్మీయ సమావేశం ఎందుకు ?

నెల్లూరు సిటీ MLA అనిల్‌కుమార్‌ ఉన్నట్టుండి నెల్లూరు వైసీపీలో కలకలం రేపారు. ఆత్మీయ సమావేశం పేరుతో సింహపురి పాలిటిక్స్‌లో ఒక్కసారిగా హీట్‌ పెంచేశారు. సీఎం జగన్‌ మీటింగ్‌కి డుమ్మాకొట్టిన అనిల్‌, ఇవాళ అనుచరులతో భేటీకానుండటం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ, ఆత్మీయ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినట్టు!. సడన్‌ మీటింగ్‌ వెనుక సీక్రెట్‌ ఏదైనా ఉందా!. ఆల్రెడీ అలకతో ఉన్న అనిల్‌... సంచలన నిర్ణయం ఏమైనా తీసుకోబోతున్నాడా!. నెల్లూరు వైసీపీలో అసలు ఇవాళ ఏం జరగబోతోంది!

Nellore: అనిల్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? ఆత్మీయ సమావేశం ఎందుకు ?
Former Minister Anil Kumar

Updated on: Jun 23, 2023 | 9:24 AM

నెల్లూరు వైసీపీలో మళ్లీ రగడ మొదలైంది!. అయితే, ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు సై అంటున్నారు MLA అనిల్‌కుమార్‌. ఇన్నాళ్లూ చూసీచూడనట్టు ఊరుకున్నా, ఇక తగ్గేదే లేదంటూ బాబాయ్‌ రూప్‌కుమార్‌కి హెచ్చరికలు పంపారు. ఇప్పటివరకూ చూసిన అనిల్‌ వేరు, ఇకపై చూడబోయే అనిల్‌ వేరు అంటూ వార్‌ను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకుపోయారు అనిల్‌.

అనిల్‌కుమార్‌, రూప్‌కుమార్‌. ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరు నెల్లూరు డిప్యూటీ మేయర్‌. వరసకు అబ్బాయ్‌-బాబాయ్‌. ఒకప్పుడు ఇద్దరూ కలిసి నడిచినవాళ్లే, కానీ ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు, ఇప్పుడు ఉప్పూనిప్పులా మారారు!. సాక్షాత్తు సీఎం జగనే కల్పించుకొని రాజీ ప్రయత్నం చేసినా ఈ ఇద్దరు వెనక్కితగ్గడం లేదు. నువ్వెంతంటే నువ్వెంతంటే సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయ్‌ ఇద్దరి మధ్య!. అయితే, మొన్నటివరకూ డైలాగ్స్‌, కేసులు, స్ట్రీట్‌ ఫైట్స్‌ వరకే పరిమితమైన గొడవలు… రీసెంట్‌గా ఎటాక్స్‌ వరకూ వచ్చాయ్‌. రూప్‌కుమార్‌ అనుచరుడు హాజీపై హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఇది ఎమ్మెల్యే అనిల్‌ పనేనంటూ రూప్‌కుమార్‌ ఆరోపణలు చేయడంతో ఇద్దరి మధ్య హైవోల్టేజ్‌ డైలాగ్‌ వార్‌ నడిచింది. మేం రివర్స్‌ ఎటాక్‌ను తట్టుకోలేరంటూ రూప్‌కుమార్‌ వార్నింగ్‌ ఇస్తే… బాబాయ్‌కి అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు అబ్బాయ్‌ అనిల్‌. తప్పుడు ఆరోపణలు చేస్తే బట్టలూడదీసి నిలువునా చీరేస్తా అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అలా, నెల్లూరు వైసీపీలో నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లింది అబ్బాయ్‌-బాబాయ్‌ ఫైట్‌.

ఇప్పటివరకూ ఒక లెక్కా-ఇకనుంచి ఇంకో లెక్క అన్నట్టుగా మారిపోయింది నెల్లూరు వైసీపీ పొలిటికల్‌ సీన్‌. అనిల్‌కుమార్‌, రూప్‌కుమార్‌… ఇద్దరిలో ఎవ్వరూ తగ్గట్లే!. అయితే, తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారట అనిల్ !. సీఎం జగన్‌-ఎమ్మెల్యే మీటింగ్‌కి గైర్హాజరైన అనిల్‌, ఇవాళ నెల్లూరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాడు. ఇదే ఇప్పుడు నెల్లూరు వైసీపీలో ఉత్కంఠ రేపుతోంది. ఉన్నట్టుండి ఎందుకీ ఆత్మీయ సమావేశం? అనిల్‌ ఎవరిపై బాంబు పేల్చబోతున్నాడు? ఎవరిని టార్గెట్‌ చేయబోతున్నాడనే చర్చ నడుస్తోంది!. ఆత్మీయ సమావేశం అంటేనే సంథింగ్‌ ఏదో ఉన్నట్టు లెక్క!. అయితే, బాబాయ్‌ రూప్‌కుమార్‌ టార్గెట్‌గానే ఆత్మీయ సమావేశం పెడుతున్నట్టు టాక్‌!. రూప్‌కుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సిందేనన్న మొండి పట్టుదలతో ఉన్నారట అనిల్‌!. మరి, ఇవాళ్టి ఆత్మీయ సమావేశంలో ఎలాంటి పొలిటికల్‌ అణుబాంబులు పేల్చపోతున్నారో వెయిట్‌ అండ్ సీ!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..