Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలోనే రానున్న 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు!

కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ మరో కానుక ప్రకటించింది. త్వరలోనే 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందించేందుకు ఆమోదం తెలిపింది. పీఎం-ఇ-బస్ సేవా పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర సర్కార్ ప్రవేశపెడుతోంది. మొత్తం 20 వేల కోట్లతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో తీసుకొస్తోంది.

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలోనే రానున్న 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు!
Electric Buses To Ap
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 05, 2025 | 5:25 PM

కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ మరో కానుక ప్రకటించింది. త్వరలోనే 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందించేందుకు ఆమోదం తెలిపింది. పీఎం-ఇ-బస్ సేవా పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర సర్కార్ ప్రవేశపెడుతోంది. మొత్తం 20 వేల కోట్లతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో తీసుకొస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు కాంట్రాక్టర్ల ద్వారా వీటిని నడపనున్నారు. ఈ పథకాన్ని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ పర్యవేక్షిస్తుంది. ఆందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 11 ప్రధాన నగరాలు ఈ పథకానికి అర్హత సాధించాయి. ఈ 11 నగరాల్లో మొత్తం 1,050 ఎలక్ట్రిక్ బస్సులను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. పూణేకు చెందిన పిన్నాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ ఈ టెండర్ దక్కించుకుంది.

తొలి దశలో వస్తున్న 750 బస్సుల్లో 100 బస్సులు విశాఖపట్నంకు మంజూరు కాగా అందులో 50 సింహపురి డిపోకు, 50 గాజువాక డిపోకు కేటాయించారు. విజయవాడకు మరో 100 బస్సులు కేటాయించారు. గుంటూరుకు 100 బస్సులు, నెల్లూరుకు 100, కర్నూలుకు 50 బస్సులు వస్తున్నాయి. ఇక కాకినాడ, రాజమండ్రి, కడప, అనంతపురం డిపోలకు 50 బస్సుల చొప్పున మంజూరయ్యాయి. తిరుపతి, మంగళగిరి డిపోలకు చెరో 50 బస్సుల కేటాయించారు. ఈ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్లను ఆయా డిపోల్లోనే ఏర్పాటు చేయనున్నారు.

ఈ బస్సుల్లో రెండు కేటగిరీలున్నాయి. ఒకటి 12 మీటర్ల పొడవు, మరొకటి 9 మీటర్ల పొడవు కలిగి ఉన్నాయి. వీటిలో 9 మీటర్ల పొడవు ఉన్న బస్సులకు కిలోమీటర్‌కు 62.17 రూపాయల చొప్పున సదరు కాంట్రాక్టర్‌కు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇక 12 మీటర్ల పొడవు ఉన్న బస్సుకు కిలోమీటర్‌కు 72.55 రూపాయల చొప్పున ఆర్టీసీ చెల్లిస్తుంది. కొత్త బస్సులు రానున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బంది నియామకం పైనా ఏపీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. డిపోల్లో అవసరమైన వారి నియామకం ఏ ప్రాతిపదికన చేయాలనే విషయమై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, దశలవారీగా కేంద్రం నుంచి మరిన్ని వాహనాలు రానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని డిపోలనూ సిద్ధం చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇకపై సంస్థలో డీజిల్, సీఎన్​జీ వాహనాల కొనుగోలు నిలివిపేసి, అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలనే ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దశలవారీగా అన్ని బస్సులనూ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించిదంది ఏపీఎస్ఆర్టీసీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..