ఎనిమిదో తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. రావి ఆకుపై అబ్బురపరుస్తున్న కళాఖండం

దేశ వ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై 12వ సారి జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. LOC తంగ్ధర్‌లో ఇండియన్ ఆర్మీ ఘనంగా జాతీయ జెండా ఎగురవేసింది. త్రివర్ణ పతాకానికి సెల్యూట్‌ చేశారు ఆర్మీ జవాన్లు. యావత్ దేశం స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది.

ఎనిమిదో తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. రావి ఆకుపై అబ్బురపరుస్తున్న కళాఖండం
Student Creativity

Edited By: Balaraju Goud

Updated on: Aug 15, 2025 | 12:08 PM

దేశ వ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై 12వ సారి జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. LOC తంగ్ధర్‌లో ఇండియన్ ఆర్మీ ఘనంగా జాతీయ జెండా ఎగురవేసింది. త్రివర్ణ పతాకానికి సెల్యూట్‌ చేశారు ఆర్మీ జవాన్లు. యావత్ దేశం స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 8వ తరగతి విద్యార్థి అద్బుత ప్రతిభను కనబర్చాడు.

కర్నూలు జిల్లా ఆదోనిలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్వన్‌పేటలో నివాసముంటున్న చెన్నప్ప-పార్వతీల మూడవ కుమారుడు భరత్ కుమార్. నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి డి విభాగంలో చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కళాత్మక దృష్టి కలిగిన విద్యార్థి జి. భరత్ కుమార్ రావి ఆకుపై భారత దేశ చిత్ర పటాన్ని ఆవిష్కరించాడు. అందులో మన జాతీయ జెండా ఆకృతిని తయారు చేసి అబ్బుర పరిచాడు. విద్యార్థి ప్రతిభను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్ తోపాు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థి భరత్ కుమార్‌ను డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్. కీరను ప్రత్యేకంగా ప్రశంసించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..