AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: 110 ఏళ్ల వయసున్న చెట్టును పడగొట్టింది వాళ్లే.. తిరిగి బతికించే యత్నం చేస్తుంది వాళ్లే

మనిషి జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగాలంటే ఏం కావాలి. అందరూ టక్కున చెప్పే సంధానం డబ్బు. ఇప్పుడు డబ్బో రక్షతి రక్షతః అని భావిస్తున్నారు కదా. స్వార్ధం, వ్యక్తి గత ప్రయాజనాల పరుగులో విలువలు మరచిపోవటంతో నేరాలసంఖ్య పెరిగిపోతుంది. కానీ డబ్బు కంటే విలువైనది.. వెలకట్టలేనిది చెట్టు. చెట్లు సహజ సిద్ధంగా ఇచ్చే ఆక్సిజన్ లేకపోతే మనిషి ప్రాణాలు నిలబడటం కష్టం. వెంటిలేటర్‌పై కృత్రిమ గాలి పీల్చుకుంటూ - ఆక్సిజన్ సిలెండర్లు భుజాన మోస్తూ బ్రతకాల్సిందే.

Andhra: 110 ఏళ్ల వయసున్న చెట్టును పడగొట్టింది వాళ్లే.. తిరిగి బతికించే యత్నం చేస్తుంది వాళ్లే
101 Year Old Tree
B Ravi Kumar
| Edited By: |

Updated on: May 28, 2025 | 1:20 PM

Share

మనిషి మనుగడ సాఫీగా సాగాలంటే చెట్లు అవసరం. అందుకే కొందరు చెట్ల ప్రయోజనాలను గుర్తిస్తున్నారు. అత్యవసర సమయంలో చెట్లు తొలగించాల్సివస్తే వాటిని తగిన జాగ్రత్తలు తీసుకుని..  అవి మల్లీ బ్రతికి చిగురించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తూర్పు గోదావరిజిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో వినాయకుని గుడి ఉంది. ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న 110 ఏళ్ల నాటి రవి చెట్టును తొలిగించాల్సి వచ్చింది. ఐతే అంత పురాతన చెట్టును ఎలాగైనా బ్రతికించాలని గ్రామస్తులు నిర్ణయించారు. కడియం మండలం బుర్రిలంకలో కొత్తపల్లి మూర్తి రసాయన చర్య ద్వారా తొలగించిన చెట్లను తిరిగి బ్రతికిస్తున్నట్లు తెలుసుకుని ప్రత్యేక జాగ్రత్తలతో చెట్టును పెకలించి జాగ్రత్తగా కడియం తరలించారు. గ్రామస్తుల చెట్టు కోసం తపన చూసి మూర్తి ఆశ్చర్యపోయారు.  ఇలా ఇంత జాగ్రత్త, శ్రద్ధతో ఒక చెట్టును బ్రతికించాలన్న తపనతో వ్యవహరించిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారని మూర్తి చెబుతున్నారు. ఇప్పటి వరకు 50 భారీ, అతి భారీ వృక్షాలకు జీవం పోసిన మూర్తి ప్రస్తుతం ఈ రావి చెట్టు మల్లి చిగురించటానికి నెల నుంచి 3 నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆలయాలకు ఇలా తిరిగి బ్రతికించిన చెట్లను ఇస్తామంటున్నారు.

మనిషి ప్రాణాల మీదకు వచ్చి అత్యవసరం ఉంటే వారికి ఐసియులో ఉంచి చికిత్స చేస్తున్నట్లు.. ఇప్పుడు చెట్లకు పునరుజ్జివింప చేసే అవకాశం దొరకటం నిజంగా మనిషి చేసుకున్న పుణ్యం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..