Andhra Rains: వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా కదులుతుంది. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీంతో కోస్తాలో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో శ్రీకాకులం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

నైరుతి రుతుపవనాలు మే 28, బుధవారం మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకు, తెలంగాణలోని చాలా ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్‌గఢ్ & ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించాయి.
మంగళవారం నాటి ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడనం బుధవారం ఉదయం 0830 గంటలకుఅదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని అనుబంధ తుఫాను ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. ఇది నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది .
భారత ప్రాంతంపై దాదాపుగా 17° ఉత్తర అక్షాంశ ము వెంబడి ఉన్న గాలుల కోత లేదా షీర్ జోన్ ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 4.5 కి.మీ మధ్య ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపు వంగి ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————
బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
శుక్రవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు… బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
బుధవారం, గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
శుక్రవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
బుధవారం, గురువారం : – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
శుక్రవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




