E-Pass: ఏపీలో ఇకపై అత్యవసర ప్రయాణానికి.. ఈ-పాస్ తప్పనిసరి.. నేటి నుంచి అమలు..

|

May 10, 2021 | 12:33 PM

E-Pass Implement In AP: కరోనా కట్టడి నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే..

E-Pass: ఏపీలో ఇకపై అత్యవసర ప్రయాణానికి.. ఈ-పాస్ తప్పనిసరి.. నేటి నుంచి అమలు..
Follow us on

E-Pass Implement In AP: కరోనా కట్టడి నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్రంలో అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఈ-పాస్ తప్పనిసరి అని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర ప్రయాణాలకు సైతం పోలీసుల అనుమతి తప్పనిసరి అని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ విధానం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ-పాస్ కావాల్సిన వారు ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్ల దగ్గర నుంచి తగిన అనుమతులు పొందాలని.. ఏ అవసరానికి వెళుతున్నారో అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలని డీజీపీ సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటికి రాకూడదని అన్నారు.

అలాగే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్య బయటికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలన్నారు. శుభకార్యాలకు స్థానిక అధికారుల అనుమతి తప్పనిసరి. అటు కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే 100, 112కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులు 104, 1902 నెంబర్లకు ఫోన్ చేసి సేవలు వినియోగించుకోవచ్చునని అన్నారు. కాగా, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. తాజాగా గత 24 గంటల్లో 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,05,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 22,164 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 92 మంది ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 8,707 కి పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 8,832 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలరో 1,90,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇవీ చదవండి:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!