AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duvvada Srinivas: దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్.. ఎవరి వెర్షన్ వారిదే.. ఇవాళ టెక్కలికి మాధురి..

తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్. థ్రిల్లర్‌ సినిమాలను మించిపోయేలా ట్విస్టుల మీద ట్విస్టులు. సీరియల్స్‌కి ఏమాత్రం తీసిపోని ఎమోషన్స్‌తో... మోస్ట్‌ బర్నింగ్‌ టాపిక్‌గా తయారైంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో... ముగ్గురు ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. అంతేకాదు...ముగ్గురూ ఎవరి బాధలు వాళ్లు చెప్పుకుంటూ యమా ఎమోషనల్‌ అవుతున్నారు. టెక్కలిలో ఎమ్మెల్సీ ఇంటి ముందు దువ్వాడ వాణి, కూతురు హైందవి ఆందోళన మూడోరోజుకు చేరింది.. దువ్వాడ ఇంటిపై హక్కు ఉందని.. భార్య, కూతురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే.. ఇవాళ టెక్కలికి వెళ్తానని మాధురి ప్రకటించారు. దువ్వాడ ఇంటిపై తనకూ హక్కు ఉందని మాధురి పేర్కొనడం సంచలనంగా మారింది..

Duvvada Srinivas: దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్.. ఎవరి వెర్షన్ వారిదే.. ఇవాళ టెక్కలికి మాధురి..
Duvvada Srinivas Family Controversy
Shaik Madar Saheb
|

Updated on: Aug 11, 2024 | 9:37 AM

Share

టెక్కలిలో దువ్వాడ ఫ్యామిలీ రచ్చ పీక్స్‌కి చేరింది. దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి మధ్యలోకి దివ్వెల మాధురి రావడంతో… గత మూడు నాలుగు రోజుల నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు, మధ్య మధ్యలో ట్విస్టులతో వెరీ హాట్‌ టాపిక్‌గా మారిందీ ఇష్యూ. ఇన్ని రోజుల ఈ ఎపిసోడ్‌లో ముగ్గురూ… ఫుల్‌ ఫైర్‌ మీదున్నారు. ఒకరిపై మరొకరు పవర్‌ ఫుల్‌ డైలాగులతో విరుచుకుపడుతూనే… అక్కడక్కా ఎమోషనల్‌ టచ్‌ ఇస్తున్నారు. తనకే ఎందుకిన్ని బాధలు అంటూ… ముగ్గురూ ఫుల్లుగా ఫీలవుతున్నారు. ఎవరి కష్టాలు వాళ్లు చెప్పుకుంటూ యమా బాధపడుతున్నారు. తనకు.. తన పిల్లలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్యాయం చేశారని భార్య వాణి పేర్కొన్నారు. మాధురి అనే మహిళతో కలిసి ఉంటున్నారని ఆరోపించారు. ఇంట్లోకి అనుమతించకపోవడంతో.. మూడ్రోజులు కారు పార్కింగ్‌ షెడ్‌లోనే నిరసన కొనసాగిస్తున్నారు వాణి ఆమె కూతురు హైందవి. తనపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారని వాణిపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే అదే ఇంటిపై మరో ఫ్లోర్ నిర్మించుకుని అక్కడే ఉంటానని చెబుతున్నారు. ఇవాళ.. టెక్కలిలోని దువ్వాడ ఇంటికి వెళ్తానని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు. ఒకవేళ తనను అడ్డుకుంటే.. పిల్లలతో సహా అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు మాధురి.

ఎవరి వర్షెన్ వారిదే..

వామ్మో… ఆమె అసలు భార్యే కాదంటూ దువ్వాడ వాణిపై రెచ్చిపోయారు దువ్వాడ శ్రీను. మామూలు టార్చర్‌ చూపించలేదండి బాబూ అంటూ… తన కష్టాలన్నీ చెప్పుకున్నారు. ఆమెతో గొడవ పడే ఓపిక లేక… ఎన్నో సార్లు కారులోనే పడుకున్నానంటూ ఎమోషనల్‌ అయ్యారు. ఆమె వేధింపులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానంటూ తెగ ఫీలయ్యారు దువ్వాడ శ్రీను. ఎక్సర్‌సైజ్‌ చేస్తుంటే… డంబెల్‌తో కొట్టింది.. కాలు కూడా ఫ్రాక్చర్‌ అయ్యింది… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యక్ష నరకమే చూసానంటున్నారాయన.

ఆయనేం నా వాళ్ల ఎఫెక్ట్‌ కాలేదు… ఆయన వల్లే నేను, నా పిల్లలు ఎఫెక్ట్‌ అయ్యామంటూ దువ్వాడ వాణి తన వెర్షన్‌ చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీను అఫైర్స్‌తో మనోవేధనలకు గురయ్యామన్నారు. ఇలాంటి విషయాలు చేయొద్దంటూ… ఆఖరికి పార్టీ సైతం హెచ్చరించినా వినట్లేదన్నారు. దువ్వాడ శ్రీను వల్ల తాము పడ్డ కష్టం పగవాడికి కూడా రావొద్దంటూ తనలో ఉన్న బాధను దువ్వాడ వాణి కూడా చెప్పుకొన్నారు.

అసలు వాళ్లేం ఎఫెక్ట్‌ అయ్యారు. అందరికి కంటే ఈ ఇష్యూలో ఎక్కువ ఎఫెక్ట్‌ అయ్యింది తానంటున్నారు దివ్వెల మాధురి. తన క్యారెక్టర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు… ఆఖరికి తన పిల్లల గురించి కూడా తప్పుడుగా వాగుతున్నారంటూ ఎమోషనల్‌ అయ్యారు మాధురి. సమాజంలో తన పరిస్థితి దారుణమైపోయిందంటూ ఆమె కూడా తన మనసులోని బాధను వెల్లగక్కారు. అంతేకాదు… సూసైడ్‌ చేసుకుంటానంటూ బాంబ్‌ పేల్చారు కూడా..

మొత్తంగా… ఎవరికి వారు తామే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యామంటూ తెగ బాధపడుతున్నారు. మరీ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తందో చూడాలి మరి…!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..