Dussehra Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

Dussehra School Holidays: ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తుంది. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సెలవులను కుటుంబంతో గడిపే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్తారు. పాఠశాలలు, విద్యార్థులు..

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

Updated on: Sep 16, 2025 | 7:37 AM

Dussehra School Holidays: విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాల పండగే. అలాంటిది ఇప్పుడు అంతా పండగ సీజన్‌ ఉంటుంది. దసరా సెలవులు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా ? అని ఎదరు చూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఏపీ సర్కార్‌. దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 9 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: ITR Date Extension: చివరి నిమిషంలో గుడ్‌న్యూస్‌.. ఐటీఆర్‌ దాఖలుకు గడువు పొడిగింపు!

ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తుంది. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సెలవులను కుటుంబంతో గడిపే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్తారు. పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సెలవుల షెడ్యూల్‌ను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన అనేకమంది సైతం స్వగ్రామాలకి పిల్లల సెలవుల నేపథ్యంలో వారి కార్యాలయాలకు సైతం సెలవులు పెట్టుకుని వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌కు సంబంధించి కేంద్రం కీలక నోటిఫికేషన్‌.. 21వ విడత ఎప్పుడు వస్తుంది?

ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారమే దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అధికారికంగా మొత్తం 13 రోజులు పండగ సెలవులిచ్చారు. 4న బడులు పునఃప్రారంభమవుతాయి.

ఇది కూడా చదవండి: Viral Video: డ్రైవర్‌కు గుండెపోటు.. కారు గాల్లోకి ఎలా ఎగిరిందో చూడండి.. ఇలాంటి వీడియో ఎప్పుడు చూసి ఉండరు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి