Visakhapatnam: నిఘా నీడలో విశాఖ.. 50 అడుగుల దూరంలో ఒక పోలీస్.. ప్రజలు ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు..

|

Nov 12, 2022 | 7:43 AM

విశాఖలో హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్ ల బస తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 7 వేల మంది పోలీసుల పహారా లో విశాఖ దిగ్బంధమైంది. ప్రధాని పర్యటన మార్గంలో 500 కి పైగా ఏర్పాటు..

Visakhapatnam: నిఘా నీడలో విశాఖ.. 50 అడుగుల దూరంలో ఒక పోలీస్.. ప్రజలు ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు..
High Security In Vizag
Follow us on

విశాఖలో హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్ ల బస తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 7 వేల మంది పోలీసుల పహారా లో విశాఖ దిగ్బంధమైంది. ప్రధాని పర్యటన మార్గంలో 500 కి పైగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నగరంలో ప్రతి 50 అడుగులకు ఒక పోలీస్ ఉండేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. డీజీపీ తో పాటు 30 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభా ప్రాంగణం వద్ద 3,500 మంది విధుల్లో ఉన్నారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్.. కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే ఉండి భద్రత ను పర్యవేక్షిస్తున్నారు. అయితే.. భద్రతా కారణంగా అధికారులు ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. కమర్షియల్, రెసిడెన్షియల్, కాలనీ వాసులు… అనుమానాస్పద వ్యక్తులను, కొత్త వ్యక్తుల్ని తమ ఇళ్లు, కాలనీలలో ఉంచకూడదని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా నినాదాలు చేయడం, బ్యానర్లు, ప్లకార్డులు, బెలూన్లు, నల్ల జెండాలను ప్రదర్శించడం చేయకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు. అత్యవసరం అయిన పనులు ఉంటే తప్ప నగర వసూలు ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు.

బహిరంగ సభకు వచ్చే వాహనాల కు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు.
మరోవైపు.. బహిరంగ సభ జరిగే ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్ మైదానాన్ని అధికారులు సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రధాని ప్రసంగంలో దాదాపు రూ.15వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేయనున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వారి కోసం 4 వేల బస్సులు, వేల సంఖ్యలో ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ కోసం కలెక్టర్‌ ఆధ్వర్యంలో 24 కమిటీలు ఏర్పాటయ్యాయి. భద్రతా కారణాల దృష్ట్యా బహిరంగ సభ జరిగే ఏయూ కాలేజీ మైదానంలోకి ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు, టీ, కాఫీ, కనీసం కాగితాలనూ తీసుకెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రధాని మోడీ ఉదయం 10.10 నిమిషాలకు ఆంధ్రా యూనివర్సిటీలోని బహిరంగ సభ జరిగే ప్రాంతాలనికి ముఖ్యమంత్రి, గవర్నర్లతో కలసి హెలికాఫ్టర్ లో వెళ్తారు. ఉదయం 10.50 నుంచి పదకొండున్నర గంటల వరకూ ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుంది. 11.45 కు ప్రధాని మోడీ ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 12. 05కు ప్రధాని స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్‌ తీసుకుంటుంది. మధ్యాహ్నం 1.10 నిమిషాలకల్లా.. హైదరాబాద్- బేగంపేట్ కు చేరుకుంటారు. ఇక్కడితో ఏపీ షెడ్యూల్ ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..