Tribal People: వరద బీభత్సానికి చిన్నపాటి కాలువలు సైతం ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మీరు చూస్తున్న విజువల్స్.. విజయనగరం జిల్లా కురుపాం మండలం గెడ్డ అవతల గ్రామాలోని దృశ్యాలు.. బోరి, బండిగూడతో పాటు.. చుట్టుపక్కల 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికంగా ఉండే గిరిజనులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. వీళ్ల ఆవస్థలు వర్ణనాతీతం. నిత్యం ఏ అవసరమైన ఈ గ్రామాల ప్రజలు.. గెడ్డదాటి పంచాయతీ కేంద్రమైన గొటివాడ లేదా మండల కేంద్రమైన కురుపాంకు రావాల్సిందే. ఇక్కడ సరైన రహదారి మార్గం లేక ఈక్కడి స్థానికులు నానా అగచాట్లు పడుతున్నారు.
గొటివాడకు, బండిగూడ గ్రామాలకు మద్యలో ఉన్న గుమ్మిడి గెడ్డ పై బ్రిడ్జి లేకపోవడంతో నీటిలో ప్రయాణించక తప్పడం లేదు ఈగ్రామాలవాసులకు. గెడ్డ కు అవతల వైపు ఉన్న పదహారు గ్రామాల ప్రజలు పరిస్థితి ఇలాగే ఉంది. అనారోగ్యం అయినా, నిత్యావసర వస్తువుల కోసం అయినా.. చివరకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కోసం అయినా .. ఈ గ్రామాల నుండి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ గెడ్డను కాలినడకన దాటి రావాల్సిందే. చివరికి ఈ గ్రామాల చిన్నారులు గొటివాడలో ఉన్న ప్రభుత్వ స్కూల్ కి వెళ్లాలన్నా.. ఈ గుమ్మడిగెడ్డ దాటి వెళ్లి రాక తప్పటం లేదు.
ఇక, మన్యంలో ఎవరికి ఆరోగ్యం సరిగ్గాలేకపోయినా.. డోలిలో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణిచంక తప్పని పరిస్థితి. ప్రస్తుతం వరద నీరు పెరుగుతున్న కొద్ది గెడ్డ కూడా ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ గెడ్డ వరద ఉధృతి.. మరింత పెరిగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. దీంతో నిత్యావసర సరుకులతో పాటు, ఎవరికైనా అనారోగ్య సమస్య నెలకొన్న నరకయాతన పడక తప్పని పరిస్థితి నెలకొంది.
Read also: CM KCR: కేంద్ర జల్ శక్తి మంత్రి షెకావత్ తో సీఎం కేసీఆర్ భేటీ.. కృష్ణా గోదావరి నదీ జలాలపై కీలక చర్చ