AP News: గెస్ట్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ.. అనుమానమొచ్చి పోలీసులు వెళ్లి చెక్ చేయగా..

డ్రగ్స్‌ కల్చర్‌.. ఏపీలోని చిన్నచిన్న పట్టణాలకు కూడా పాకడం షాకిస్తోంది. ఓ బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్‌ పట్టుబడడం కలకలం రేపుతోంది.. ఇంతకీ.. ఈ డ్రగ్స్‌ పట్టుబడిందెక్కడో.. ఏంటో.. తెలుసుకుందాం పదండి...

AP News: గెస్ట్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ.. అనుమానమొచ్చి పోలీసులు వెళ్లి చెక్ చేయగా..
Guest House
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 10, 2024 | 12:26 PM

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌ కల్చర్‌ ఆందోళన కలిగిస్తోంది. నగరాలు, పట్టణాల్లో డ్రగ్స్‌కు సంబంధించి ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఒక చోట డ్రగ్స్‌, గంజాయి ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. అయితే.. సిటీల సంగతి పక్కన బెడితే.. ఇప్పుడు చిన్నపట్టణాల్లోనూ డ్రగ్స్ కల్చర్‌ వెలుగలోకి వస్తుండడం భయాందోళనకు గురిచేస్తోంది. పోలీసులకు కూడా సవాల్‌గా మారుతోంది. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్‌ దొరకడం కలకలం రేపింది.

భూపాలపట్నంలో పుట్టినరోజు వేడుకల్లో యువతీ, యువకులు పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అర్థరాత్రి రైడ్‌ చేశారు. ఫంక్షన్‌ హాల్‌లో మద్యం బాటిల్స్‌తోపాటు.. బయట ఉన్న కారులో డ్రగ్స్‌ ప్యాకెట్లు బయటపడ్డాయి. రెండు గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుని.. కారును సీజ్‌ చేశారు. బర్త్‌ డే ఈవెంట్‌ ఆర్గనైజర్‌తోపాటు.. ముగ్గురు యువకులు డ్రగ్స్‌ సేవిస్తున్నట్లు గుర్తించి.. తాగిన మైకంలో ఉన్నవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ సేవించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్పెషల్‌ పార్టీ టీమ్‌ ఎటాక్‌ చేయగా.. రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక.. వీరికి డ్రగ్స్‌ ఎలా వచ్చాయి?.. వీరే డ్రగ్స్‌ కొనుగోలు చేసి సేవిస్తున్నారా?.. ఇంకా.. ఎవరికైనా సప్లై చేస్తున్నారా?.. అసలు డ్రగ్స్‌ రాకెట్‌ వెనక ఎవరున్నారు?.. అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఇప్పటికే.. ఏపీలో గంజాయి, డ్రగ్స్‌ వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్‌ పెట్టింది. డ్రగ్స్‌ వాడకం, సరఫరాను తీవ్రంగా పరిగణిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!