Andhra Pradesh: చెన్నై-విజయవాడ హైవేపై కారును ఆపిన అధికారులు.. అనుమానంతో సీట్ల కింద చూడగా..

|

Jun 10, 2023 | 8:21 PM

Andhra Pradesh News: ఈ నెల 7వ తేదీన చెన్నై విజయవాడ హైవే, నెల్లూరు సమీపంలోని వెంకటాచలం టోల్‌ ప్లాజా వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో టోల్‌ గేట్‌ వైపు వచ్చిన ఓ కారును ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎవరికీ అనుమానం రాకుండా

Andhra Pradesh: చెన్నై-విజయవాడ హైవేపై కారును ఆపిన అధికారులు.. అనుమానంతో సీట్ల కింద చూడగా..
representative image
Follow us on

DRI Seizes Smuggled Gold: అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో ఒక మార్గంలో గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లర్లు బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌, నెల్లూరు జిల్లాల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు శనివారం వెల్లడించారు. రెండు ప్రాంతాల్లో 10.27 కిలోల బంగారాన్ని సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు సెర్చింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఈ నెల 7వ తేదీన చెన్నై విజయవాడ హైవే, నెల్లూరు సమీపంలోని వెంకటాచలం టోల్‌ ప్లాజా వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో టోల్‌ గేట్‌ వైపు వచ్చిన ఓ కారును ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎవరికీ అనుమానం రాకుండా సీటు కింద దాచి తరలిస్తున్న 7.798 కిలోల విదేశీ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే, బంగారాన్ని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మరోచోట అక్రమ బంగారం ఉన్నట్లు నిందితులు చెప్పారు. దీంతో వెంటనే మరో బృందం ఆ ప్రాంతానికి చేరుకొని తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.

ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లు, ఒక రిసీవర్‌ను జ్యుడిషియల్‌ అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఆర్ఐ పేర్కొంది. కాగా.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..