Rotten Eggs: నిర్లక్ష్యం.. నిద్ర మత్తు.. గర్భిణీలకు కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ..

|

Jul 15, 2021 | 7:17 AM

అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడి గుడ్ల సరఫరా చేసేవారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి తోడు స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారుల నిద్రమత్తు కూడా ఇందుకు తోడవుతోంది. గత నాలుగు రోజుల క్రితం చిన్నారులకు కుళ్లిన కోడిగుడ్లను...

Rotten Eggs: నిర్లక్ష్యం.. నిద్ర మత్తు.. గర్భిణీలకు కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ..
Egg
Follow us on

మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనేది అంగన్‌వాడీ సెంటర్ల టార్గెట్. ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్, బాలామృతం, ఆరోగ్యలక్ష్మి , హెల్త్‌ చెకప్‌ వంటి చాలా ప్రాజెక్టులు ఈ సెంటర్ల కిందికే వస్తాయి. మహిళ గర్భవతి అయినప్పటి నుంచి చిన్నారులు పెద్దయ్యేవరకు వారి సంరక్షణ బాధ్యతలు అంగన్‌వాడీలదే. అలాంటి సెంటర్లు అబాసుపాలవుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షలాగే మారింది. ప్రతీ ఒక్కరికి పౌష్టికాహారం అందించాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీలను బలోపేతం చేస్తూ వస్తోంది.

కుళ్ళిన గుడ్లు..

విజయనగరం జిల్లా అధికారుల నిర్లక్ష్యం లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతోంది. పౌష్టికాహారం మాట అటుంచితే నెలవారీగాసరఫరా చేసే గుడ్లు సక్రమంగా ఇవ్వకపోవడం గమనార్హం. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో నెలలో 16 కోడి గుడ్లను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడి గుడ్ల సరఫరా చేసేవారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి తోడు స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారుల నిద్రమత్తు కూడా ఇందుకు తోడవుతోంది. గత నాలుగు రోజుల క్రితం చిన్నారులకు కుళ్ళిన కోడిగుడ్లను ఐసిడిఎస్ సిబ్బంది పంపిణీ చేశారు. మరోసారి అదే పని చేశారు. అయితే ఇప్పుడు చిన్నారులకు కాకుండా.. తాజాగా గర్భిణీలకు కుళ్ళిన కోడిగుడ్లను పంపిణీ చేసి దొరికిపోయారు ఐసిడిఎస్ సిబ్బంది.

నాణ్యతాలోపంతో కోడిగుడ్లు పంచుతున్న కాంట్రాక్టర్‌కు అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు పనిపిస్తున్నా… పిర్యాదులు రాకపోవడంతో ప్రభుత్వం దృష్టి పెట్టలేక పోయింది. చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం కోసం కోడిగుడ్లు పంచుతున్న ప్రభుత్వం.. ఐసిడిఎస్ అవినీతితో ప్రక్కదారి పట్టిస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం గాలికి పోతోంది. కుళ్ళిన కోడిగుడ్లు పంపిణీ పై లబ్ధిదారులు  మండిపడుతున్నారు. అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో లక్ష్యం..

ఆరోగ్యలక్ష్మి పథకం కింద 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఒక పూట భోజనంతో పాటు ఉడికించిన గుడ్లు, కుర్‌కురేలు, గర్భిణీ, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు 200 మి.లీ పాలు, ఉడికించిన గుడ్లు ప్రతీ రోజు అందిస్తున్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Sharad Pawar: ఫలితాల గురించి అంతా తెలుసు.. రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం అబద్ధం: శరద్‌ పవార్‌

AP CM YS Jagan: ఆక్వా హబ్‌లు, ఆక్వా వర్విటీ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్‌.. అధికారులతో సీఎం జగన్ సమీక్ష.. చిత్రాలు..