Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే సహకరించడం లేదు.. కేంద్రానికి లేఖ రాస్తా: పవన్ కల్యాణ్ ఫైర్

ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తామంటున్నారు. యాంకరేజ్‌ పోర్టులో పర్యటించిన పవన్ కల్యాణ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చారు.

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే సహకరించడం లేదు.. కేంద్రానికి లేఖ రాస్తా: పవన్ కల్యాణ్ ఫైర్
Pawan Kalyan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 29, 2024 | 4:41 PM

కాకినాడ యాంకరేజ్‌ పోర్టు అక్రమార్కులకు అడ్డాగా మారింది. కొన్ని ముఠాలు రేషన్ బియ్యం సహా పలు రకాల వస్తువులను ఓడలో విదేశాలకు తరలిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్‌ రెండు రోజుల క్రితం సముద్రంలో బియ్యంలోడ్‌ వెళ్తున్న ఓడను ఛేజ్‌ చేశారు. సినీఫక్కీలో సముద్రంలోనే ఓడను నిలిపివేసి తనిఖీలు చేశారు. 5 కంటైనర్లలో విదేశాలకు తరలిస్తోన్న 38వేల టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. వీటిలో 640 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఓడను కస్టమ్స్‌ అధికారుల బోట్లకు కట్టేసి కాకినాడ పోర్టుకు తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు.

ఓడలో భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడ్డ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కాకినాడ పోర్టును సందర్శించారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లారు. కలెక్టర్ షాన్ మోహన్‌ పట్టుకున్న రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. యాంకరేజ్‌ పోర్టు నుంచి టన్నుల కొద్దీ రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు పవన్ కల్యాణ్‌. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్ర, డీఎస్పీ రఘు వీర్, సివిల్ సప్లై DSO ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి సైతం పవన్ కల్యాణ్‌ చురకలు అంటించారు. పోర్టులో అక్రమాలు జరుగుతుంటే మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అసహనం వ్యక్తం చేశారు. పట్టుబడ్డ బియ్యాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తనకు అధికారులు సరిగా సహకరించలేదన్నారు పవన్ కల్యాణ్‌. బియ్యం అక్రమ రవాణా ముఠా వేళ్లూనుకుపోయినట్టు కనిపిస్తుందన్నారు.

కాకినాడ తీరంలో భద్రత పేలవంగా ఉందన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. భద్రతపై కేంద్రానికి లేఖ రాస్తానన్నారు.. అధికారుల పేర్లను సేకరించాలని అధికారులను ఆదేశించారు.. కాకినాడ పోర్టు స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిందని.. స్మగ్లింగ్‌ అనేది కేవలం బియ్యంతో ఆగదంటూ పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు. వంద కిలోల RDX తీసుకొస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాను కాకినాడకు వస్తానంటే రావొద్దని కొందరు మెసేజ్‌లు చేశారని.. మంత్రి చెప్పినా చర్యలు చేపట్టడంలేదంటూ అధికారులపై మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తనకే అధికారులు సహకరించడం లేదన్నారు.. ఏపీ గంజాయికి అడ్డాగా మారిందంటూ ఫైర్ అయ్యారు.. రూపాయి పెట్టుబడి లేకుండా రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లి ఆఫ్రికా దేశాల్లో కిలో 70కి అమ్ముతున్నారని పవన్‌ మండిపడ్డారు.

అక్రమ బియ్యాన్ని తరలిస్తోన్న వారిపై చర్యలు తప్పవన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ వల్లే కాకినాడ పోర్టుకు చెడ్డపేరు వచ్చిందని ఆరోపించారు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!