Andhra Pradesh: అసలు చేసిందే దరిద్రపు పని.. ఆ తర్వాత, ప్రిన్సిపల్‌పై బ్లేడుతో దాడి.. ఎందుకిలా..?

|

Jun 30, 2023 | 8:12 AM

Prakasam district news: చిన్నతనంలో కొందరు అమానుషంగా ప్రవర్తిస్తూ నేరాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. చదివుతోంది ఇంటరే.. కానీ, పరీక్షల్లో కాపీయింగ్ కు పాల్పడ్డాడు.. ఇది గమనించిన స్క్వాడ్ అతన్ని డిబార్ చేసింది..

Andhra Pradesh: అసలు చేసిందే దరిద్రపు పని.. ఆ తర్వాత, ప్రిన్సిపల్‌పై బ్లేడుతో దాడి.. ఎందుకిలా..?
Crime News
Follow us on

Prakasam district news: చిన్నతనంలో కొందరు అమానుషంగా ప్రవర్తిస్తూ నేరాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. చదివుతోంది ఇంటరే.. కానీ, పరీక్షల్లో కాపీయింగ్ కు పాల్పడ్డాడు.. ఇది గమనించిన స్క్వాడ్ అతన్ని డిబార్ చేసింది.. దీంతో ఆ విద్యార్థి డిబార్ చేసిన ప్రిన్సిపల్ పై కక్ష పెంచుకున్నాడు.. కొన్ని నెలల తర్వాత మాటు వేసి మరి బ్లేడ్ తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. పరీక్షలు రాయకుండా డీబార్‌ చేశారన్న కారణంతో ఓ విద్యార్థి కళాశాల ప్రిన్సిపల్‌పై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసిన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

గిద్దలూరులోని ఓ వీధిలో నివాసం ఉంటున్న గొంట్ల గణేష్‌ అనే విద్యార్థి స్థానికంగా ఉన్న సాహితి జూనియర్‌ కళాశాలలో ఇంటర్ పరీక్షలు రాశాడు. ఈ క్రమంలో పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడటంతో గమనించిన స్క్వాడ్‌ బృందం.. పరీక్షలు రాయకుండా గణేష్ ను డీబార్‌ చేసింది. అయితే, తన డిబార్ కు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ కొండారెడ్డే కారణమంటూ గణేష్‌ అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో కొండారెడ్డి గాంధీ బొమ్మ సెంటర్లో ఉండగా.. గణేష్‌ అతనిపై బ్లేడుతో దాడిచేశాడు. కొంచెండ మెడ కోసుకుపోయింది.. ఈ క్రమంలో కొండారెడ్డి చేతిని అడ్డుపెట్టగా.. చేతికి కూడా గాయమైంది.

గమనించిన స్థానికులు అడ్డుకునేందుకు వెళ్లగా.. వారిని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం కొండారెడ్డిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గణేష్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..